Festival Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. క్రిస్మస్‌కు స్పెషల్ ట్రైన్స్..
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:49 PM
క్రిస్మస్‌కు ఊరికి వెళ్లాలనుకునే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి.
సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాలకు ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి, పదార్‌పూర్‌లకు స్పెషల్ ట్రైన్స్ వెళ్లనున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా క్రిస్మస్‌కు ఊరికి వెళ్లాలనుకునే వారికి ఎంతో మేలు జరగనుంది. ఇక, స్పెషల్ ట్రైన్స్ షెడ్యూల్ వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ - కాకినాడ స్పెషల్స్..
స్పెషల్ ట్రైన్ నెంబర్ 07196 హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి కాకినాడ వరకు వెళ్లనుంది. డిసెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్ నడుస్తుంది. అది కూడా మంగళ, బుధవారాలు మాత్రమే ఈ స్పెషల్ ట్రైన్ నడవనుంది. చర్లపల్లి నుంచి రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కాకినాడ బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. 07195 నెంబర్ ట్రైన్ కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు నడుస్తుంది. డిసెంబర్ 28వ తేదీనుంచి 31వ తేదీ వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. అది కూడా ఆదివారం, బుధవారాల్లో మాత్రమే ట్రైన్ నడుస్తుంది. కాకినాడ నుంచి రాత్రి 7.50 గంటలకు చర్లపల్లి బయలు దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
హైదరాబాద్ - తిరుపతి స్పెషల్స్..
స్పెషల్ ట్రైన్ నెంబర్ 07031 హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు నడుస్తుంది. డిసెంబర్ 19వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. అది కూడా ప్రతీ శుక్రవారం మాత్రమే ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం 3.35 గంటల ప్రాంతంలో చర్లపల్లి నుంచి రైలు బయలు దేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, వినుకొండ, దొనకొండ, గిద్దలూరు, నంద్యాల, కడప మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఇక, స్పెషల్ ట్రైన్ నెంబర్ 07000 తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు నడుస్తుంది. డిసెంబర్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ప్రతీ మంగళవారం ట్రైన్ అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుంచి సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి బయలు దేరుతుంది.
ఇవి కూడా చదవండి
పదే పదే వైరల్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి.!
వీర్యదాతకు అరుదైన క్యాన్సర్.. ప్రమాదంలో 200 మంది చిన్నారుల ప్రాణాలు