Sperm Donor with Rare Cancer: వీర్యదాతకు అరుదైన క్యాన్సర్.. ప్రమాదంలో 200 మంది చిన్నారుల ప్రాణాలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:32 PM
ఓ వ్యక్తికి అరుదైన క్యాన్సర్ ఉన్న విషయం తెలియకుండా అతని నుంచి స్పెర్మ్‌ను తీసుకొని యూరప్ అంతటా దాదాపు 200 మంది పిల్లలను గర్భం దాల్చడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
యూరప్ అంతటా ఓ వీర్య దాత కారణంగా సుమారు 200 మంది చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. క్యాన్సర్ కు కారణం అయ్యే ఓ ప్రమాదకరమైన జన్యు లోపం ఉన్న వ్యక్తి కి సంబంధించిన స్పెర్మ్‌ను ఉపయోగించి గర్భం దాల్చారు. తద్వారా జన్మించిన పిల్లల శరీరంలోని ప్రతి కణంలో దీని ప్రభావం ఉంటుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ స్పెర్మ్ తో గర్భం దాల్చిన వారిలో కొంతమంది చిన్నారుల ఇప్పటికే క్యాన్సర్ బారిన పడి చనిపోయినట్లు తేలడంతో ఇప్పుడు మిగిలిన పిల్లల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
డెన్మార్క్‌కు చెందిన ఓ వ్యక్తి స్పెర్మ్ లో TP53 అనే జన్యువులో లోపం ఉంది.ఈ లోపంతో ఉన్న ఉన్న వాళ్ల స్పెర్మ్ తో పుట్టి పిల్లలకు ‘లి-ఫ్రామినీ సిండ్రమ్’ అనే ఓ అరుదైన వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. 60 ఏళ్ల వయసు వచ్చే వరకు క్యాన్సర్ భారిన పడే అవకాశాలు తొంబై శాతం ఉంటుంది. ఈ సిండ్రోమ్ వల్ల రొమ్ము క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఎముక క్యాన్సర్లు (ఆస్టియోసార్కోమా) భారిన పడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. డెన్మార్క్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ DR నివేదించిన తర్వాత ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క డెన్మార్క్‌లో 99 జననాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఓ విద్యార్థి డబ్బు కోసం 2005లో స్పెర్మ్ దానం చేశాడు. అతని నమూనాలను దాదాపు 17 ఏళ్ల పాటు వివిధ సంతాన సాఫల్య కేంద్రాలు ఉపయోగించాయి. అప్పట్లో సాధారణ స్క్రీనింగ్ టెస్ట్ లో ఈ జన్యు లోపాన్ని గుర్తించలేకపోయారు. డెన్మార్క్ కు చెందిన యురోపియన్ ఈ స్పెర్మ్ బ్యాంక్ ని 14 దేశాలలో దాదాపు 67 క్లీనిక్ లకు సరఫరా చేసింది.ఆ స్పెర్మ్‌ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా కనీసం 197 మంది గర్భం దాల్చి పిల్లలకు జన్మనిచ్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
2025లో వైద్యనిపుణులు ఈ అంశాన్ని గుర్తించి హెచ్చరించడంతో అసలు విషయం బయటపడింది. ఏది ఏమైనా ఈ దారుణ ఘటనతో స్పెర్మ్ దాతల స్క్రీనింగ్, సంతాన సాఫల్య చికిత్సల నిబంధనలలో నిర్లక్ష్యం బయటపడింది. దారుణం ఏంటంటే.. UK లో ఈ దాత స్పెర్మ్ ని దాదాపు పది కుటుంబాలు ఉపయోగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ జన్యుపరమైన లోపంతో ఉన్న చిన్నారులపై డాక్టర్లు స్పెషల్ ఫోకస్ పెట్టి, క్యాన్సర్ ని తొలిదశలోనే రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ కీలక భేటీ.. పెట్టుబడులపై చర్చ
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ