Home » Indigo
ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నానా అవస్థలు పడ్డారు. అసలు ఏం జరుగుతోందో తెలియక, సరైన సమాధానం చెప్పే వారు లేక టార్చర్ అనుభవించామని పలువురు వాపోయారు.
సిబ్బంది కొరత తలెత్తడంతో ఇండిగో ఫ్లైట్ సర్వీసుల్లో తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఫ్లైట్ డ్యూటీకి సంబంధించిన కొత్త నిబంధనలు సిబ్బంది కొరతకు దారి తీసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కస్టమర్లకు ఇండిగో క్షమాపణలు చెప్పింది. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయని వెల్లడించింది.
పసిపిల్లలతో ఫ్లైట్ ప్రయాణం సవాలుతో కూడిందే. వారి తల్లిదండ్రులకు తమ వంతు మద్దతుగా ఇండిగో ఎయిర్ లైన్స్ ఒక స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఒక రూపాయికే ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ..
గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానం హుబ్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ లో వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఈ మధ్య కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు బాగా పెరిగిపోయాయి. తాజాగా, జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానం దారి మళ్లింది.
శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబయి ఎయిర్ పోర్ట్కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్పై పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు.
ఇండిగో విమానంలో క్యాబిన్ క్రూ గా పనిచేస్తున్న జమ్మూకు చెందిన జాహ్నవి గుప్తా (25) ఈనెల 24న రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు పోలీసులు, మృతురాలి తల్లి సోనిక గుప్తా వెల్లడించారు.
విజయవాడ-సింగపూర్ మార్గంలో నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఈ సర్వీస్ మొదలైతే విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఊరట లభించనుంది.
మదురై నుంచి శనివారం తెల్లవారుజామున చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానం ముందు వైపు అద్దం పగలడంతో కలకలం చోటుచేసుకుంది.
మధ్యాహ్నం 3.33 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు.