Indigo flights: తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయ్..
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:02 PM
తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తిరుపతి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాథన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.
- ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్
రేణిగుంట: తిరుపతి విమానాశ్రయం నుంచి ఇండిగో విమానాల(Indigo flights) రాకపోకలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించినట్లు తిరుపతి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాథన్(D. Bhoominathan) తెలిపారు. డిసెంబరు 7వ తేదీ నుంచి విమానాశ్రయ కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు. తిరుపతి విమానాశ్రయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
5, 6 తేదీల్లో మాత్రం ఇండిగో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. డిసెంబరు 5న తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలు సాగించాల్సిన 24 విమానాల్లో 18 రద్దుకాగా 6 విమానాలు ఆలస్యంగా నడిచాయన్నారు. అలాగే డిసెంబరు 6న 2 విమానాలు రద్దుకాగా 10 విమానాలు ఆలస్యంగా నడిచాయని వివరించారు. ఈ అంతరాయం కేవలం ఇండిగో విమానాలకు మాత్రమే పరిమితమైందని, ఇతర విమానయాన సంస్థల కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయని చెప్పారు.

అయితే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తిరుపతి విమానాశ్రయం, ఇండిగో ఎయిర్‌లైన్స్ సంయుక్త కార్యాచరణ ప్రణాళికతో పూర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టినట్టు భూమినాథన్ తెలిపారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు, వసతి, విమాన ఛార్జీల పూర్తి రీఫండ్, క్యాబ్ సౌకర్యం, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కల్పించినట్టు వివరించారు. ఈ మీడియా సమావేశంలో డీజీసీఏ డైరెక్టర్ దొరైరాజ్, సీఐఎ్‌సఎఫ్ కమాండెంట్ అనురాగ్‌యాదవ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2030 నాటికి అమెజాన్ ఇండియా రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్
Read Latest Telangana News and National News