Home » Flight Ticket Offers
చెన్నై నగరం నుంచి ఇతర నగరాలకు వెళుతున్న విమాన ఛార్జీ లు రెండున్నర రెట్లు పెరిగాయి. శాసనసభ ఎన్నికలు గురువారం ఒకేవిడతలో జరుగుతున్నాయి.
తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ఇండిగో విమానాల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
గుడ్‌ఫ్రైడేతో పాటు శని, ఆదివారాలు కలిసి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో నగర వాసులు తమ సొంతూళ్ళకు క్యూకట్టారు.
తిరుపతి నుంచి ఇండిగో విమానాలన్నీ నడుస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని తిరుపతి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ డి.భూమినాథన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండిగోకు చెందిన అన్ని విమానాలూ తిరుపతి నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు.
చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక.. అంటూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో అర్బన్ కమ్యూటింగ్ లగ్జరీగా మారిపోతోందని కొందరంటుంటే, భారతదేశంలో ట్రాన్స్‌పోర్టేషన్ ధరల మధ్య తీవ్ర తేడాల్ని హైలైట్ చేస్తున్నారు.
దసరా పూర్తైంది. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసం, క్రిస్మస్ పండుగల సీజన్ వచ్చేస్తుంది. పండుగల టైంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విమాన టికెట్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది.
బాలయోగి జయంతి రోజున రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాజమండ్రి నుంచి తిరుపతికి 35 టిక్కెట్లకు రూ.1999..
అమెరికా విమాన ప్రయాణానికి నకిలీ టికెట్లను అంటగట్టిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి భరత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భరత్‌నగర్‌లోని శక్తినగర్‌కు చెందిన దేవరపల్లి తిరుపతిరెడ్డిని అతని మిత్రుడు గోలిపల్లి సంజీవ్ అమెరికా వెళ్లి వచ్చేందుకు విమాన టికెట్లు కావాలని సంప్రదించాడు.
శంషాబాద్ టు వియత్నాం.. నూతన విమాన సర్వీ్‌సును ప్రారంభించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వియత్నాం విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. వియత్నాం రాజధాని హనోయ్‌కు నూతన విమాన సర్వీ్‌సును ప్రారంభించారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 1 (ఆంధ్ర జ్యోతి): కేవలం రెండు గంటల్లోనే రాజమహేం ద్రవరం నుంచి ముంబైకి వెళ్లవచ్చని రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరం (మధురపూడి) విమా నాశ్రయం నుంచి ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తొలిసారిగా ముంబైకి నేరుగా విమాన సర్వీసు