Fake tickets: వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - Sep 05 , 2025 | 08:17 AM
అమెరికా విమాన ప్రయాణానికి నకిలీ టికెట్లను అంటగట్టిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి భరత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భరత్‌నగర్‌లోని శక్తినగర్‌కు చెందిన దేవరపల్లి తిరుపతిరెడ్డిని అతని మిత్రుడు గోలిపల్లి సంజీవ్ అమెరికా వెళ్లి వచ్చేందుకు విమాన టికెట్లు కావాలని సంప్రదించాడు.
- అమెరికాకు నకిలీ టికెట్లు..
- విమాన సీటు వివరాలు లేకపోవడంతో వెలుగులోకి మోసం
హైదరాబాద్: అమెరికా విమాన ప్రయాణానికి నకిలీ టికెట్లను అంటగట్టిన ఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్(Sanathnagar Police Station) పరిధి భరత్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భరత్‌నగర్‌లోని శక్తినగర్‌కు చెందిన దేవరపల్లి తిరుపతిరెడ్డిని అతని మిత్రుడు గోలిపల్లి సంజీవ్ అమెరికా వెళ్లి వచ్చేందుకు విమాన టికెట్లు కావాలని సంప్రదించాడు. దీంతో తిరుపతి రెడ్డి తన సహ ఉద్యోగి డీఎంఎస్ ప్రసాద్ ద్వారా శ్రీకాంత్‌ను కలిశాడు.
విమాన టికెట్లు బుక్ చేసేందుకు సంజీవ్ వద్ద శ్రీకాంత్ రూ.2,12,450 తీసుకున్నాడు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ టికెట్ నిర్ధారణ పత్రాల పేరిట ఓ సాఫ్ట్ కాఫీని సంజీవ్‌కు పంపాడు. తిరుగు ప్రయాణంలో దుబాయిలో ఎక్కువ సేపు ఆగుతుందని గుర్తించి టికెట్లను మార్చాలని సంజీవ్ కోరాడు. దీంతో టికెట్ రద్దుకు రూ.13వేలతో పాటు అదనపు టికెట్‌కు రూ.లక్ష చెల్లించాలని శ్రీకాంత్ చెప్పడంతో సంజీవ్ ఆ నగదును కూడా చెల్లించాడు.

తిరుపతిరెడ్డి కూడా తన కుమార్తె అమెరికా నుంచి హైదరాబాద్‌కు రావడం కోసం టికెట్ కావాలని రూ.43వేలు శ్రీకాంత్‌కు ఇచ్చాడు. అతనికి కూడా ఓ సాఫ్ట్ కాఫీని పంపాడు. అయితే విమానంలోని సీటింగ్, ఆహారం తదితర వివరాలు లేకపోవడంతో అనుమానంతో సంజీవ్ ఆరా తీశాడు. శ్రీకాంత్(Srikanth) పంపినవి నకిలీ టికెట్లు అని తే లింది. మోస పోయామని గ్రహించిన బాధితులు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో కాల్పుల విరమణ ప్రకటించాలి
‘గే’ యాప్ ‘గ్రైండర్’ ద్వారా డ్రగ్స్ విక్రయం
Read Latest Telangana News and National News