Share News

Flight Cheaper Than Cab: చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక

ABN , Publish Date - Nov 28 , 2025 | 02:10 PM

చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక.. అంటూ నెటిజన్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే, ఇదే సమయంలో అర్బన్ కమ్యూటింగ్ లగ్జరీగా మారిపోతోందని కొందరంటుంటే, భారతదేశంలో ట్రాన్స్‌పోర్టేషన్ ధరల మధ్య తీవ్ర తేడాల్ని హైలైట్ చేస్తున్నారు.

Flight Cheaper Than Cab: చవక.. చవక.. క్యాబ్ కంటే ఫ్లైట్ ప్రయాణం చవక
flight Cheaper Than Cab

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ రాజధాని లెహ్‌కి(925 కి.మీ) వెళ్లేందుకు ఫ్లైట్ ఖర్చు రూ. 1,540. కానీ గురుగ్రామ్ నుంచి గ్రేటర్ నాయిడాకి (70 కి.మీ.)దూరం. అయితే, దీనికి ఉబర్ క్యాబ్ చూపించిన ధర రూ. 1,952.61. ఈ షాకింగ్ కంపారిజన్ సోషల్ మీడియా ఎక్స్‌లో వైరల్ అయింది.

ఢిల్లీ యూజర్ ఆరేన్ష్ పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు మీద నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. 925 కి.మీ. దూరం.. 90 నిమిషాల్లో పూర్తయ్యే ఫ్లైట్‌ జర్నీ.. క్యాబ్‌ కంటే రూ. 400 తక్కువగా ఉండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్పైస్‌జెట్ ఫ్లైట్ టికెట్ ధరలో ఆఫ్-సీజన్ డిస్కౌంట్ కారణంగా ఈ ఆశ్చర్యకరమైన రేటు వచ్చిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.


సదరు ఫ్లైట్ ధరలు సీజన్ సమయంలో రూ. 10,000 నుంచి రూ. 25,000 వరకు ఉంటాయి. కానీ లెహ్‌లో శీతాకాలంలో సబ్-జీరో ఉష్ణోగ్రతలు, కఠిన వాతావరణం కారణంగా ఇప్పుడు డ్రాప్ అయ్యాయి. మరోవైపు, NCRలో ఉబర్, ఒలా వంటి అప్-బేస్డ్ క్యాబ్‌లు పీక్ అవర్స్‌లో 2x లేదా 3x సర్జ్ ప్రైసింగ్ విధించడం, ట్రాఫిక్, టోల్స్, డ్రైవర్ ఇన్సెంటివ్స్ కారణంగా ధరలు పెరగడం దీనికి ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి.

అయితే, నెటిజన్స్ దీని మీద వెరైటీగా రియాక్షన్స్ ఇస్తున్నారు. 'ఫ్లైట్‌లు.. క్యాబ్‌ల కంటే చౌక అవ్వడం ప్రోగ్రెస్ లేదా జోక్?' అంటూ ఒకరు పోస్ట్ చేశారు. మరొకరు, 'అర్బన్ కమ్యూటింగ్ లగ్జరీగా మారిపోతోంది' అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ NCR(National Capital Region)లో రోడ్ ట్రావెల్ ఖర్చులు, సర్జ్ ప్రైసింగ్ మీద ప్రజల ఆగ్రహాన్ని మళ్లీ తెరమీదకి తీసుకొచ్చాయి. మెట్రో సిటీల్లో డైనమిక్ ప్రైసింగ్ డిమాండ్-సప్లైని బ్యాలెన్స్ చేయడానికి ఉన్నప్పటికీ, కమ్యూటర్లకు ఇది భారం అవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఉదంతం భారతదేశంలో ట్రాన్స్‌పోర్టేషన్ ధరల మధ్య తీవ్ర తేడాలను హైలైట్ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 02:33 PM