Share News

Ram Mohan Naidu: రాజమండ్రి టు తిరుపతి విమాన సర్వీసు: కేంద్రమంత్రి

ABN , Publish Date - Oct 01 , 2025 | 10:54 AM

బాలయోగి జయంతి రోజున రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. రాజమండ్రి నుంచి తిరుపతికి 35 టిక్కెట్లకు రూ.1999..

Ram Mohan Naidu:  రాజమండ్రి టు తిరుపతి విమాన సర్వీసు: కేంద్రమంత్రి
Rajahmundry airport

రాజమండ్రి, అక్టోబర్ 1: గోదావరి ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి జయంతి రోజున రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చామని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.

రాజమండ్రి నుంచి ముంబై, ఢిల్లీకి ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. తిరుపతికి మంచి డిమాండ్ ఉందన్న కేంద్రమంత్రి.. డిమాండ్ ఉన్న సర్వీసులకు మరో మూడు నెలల వరకు టిక్కెట్లు బుక్కయ్యాయని ఆయన తెలిపారు.


రాజమండ్రి నుంచి తిరుపతికి మొదటి 35 టిక్కెట్లకు రూ.1999, 35 నుంచి 70 టిక్కెట్ల వరకు నాలుగు వేలకే టిక్కెట్ల ధర నిర్ణయించామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా నూతన టెర్మినల్ ను ప్రారంభిస్తామని, రాజమండ్రి నుంచి బెంగుళూరుకు మరో విమాన సర్వీసు, వారణాసికి ఇంకొక విమాన సర్వీసు అందుబాటులో తీసుకువస్తామని చెప్పారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి అన్ని ప్రాంతాలకు ఆక్యుపెన్సీ 100 శాతం ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు.


Updated Date - Oct 01 , 2025 | 11:49 AM