రజకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి ప్రత్యేక కాలనీ ఏ ర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గోరంట్ల బు చ్చయ్యచౌదరి అన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 16వ డివిజన్లో రూ.17.70 లక్షల వ్యయంతో చేపట్టిన గౌతమి దోబిఖాన ఆధు నీకరణ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.
ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సేవలందించడంలో వైద్యు లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండంలోని రామవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తని ఖీ చేశారు.
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ తిరునాళ్లు గురువారం నుంచి ఆరంభ మయ్యాయి.
పంచాయితీరాజ్ వ్యవస్థ కార్యకలాపాలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు డివిజనల్ అభివృద్ధి అధికారి (డీడీవో) కార్యాలయాలు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఉమ్మడి జిల్లాలో భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతు న్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ పథకానికి అంచనాలకు మించిన స్పందన వ్యక్త మవుతోంది.
దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.
మీ సమస్యలు చెప్పండి.. వింటా.. పరిష్కరిస్తా.. అం టూ సీఎం చంద్రబాబు రైతులతో కలిసిపోయారు.. నల్లజర్ల లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో సాధారణ నులక మం చంపై కూర్చుని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా సీఎం చంద్రబాబు చెట్టుకింద కూర్చుని రైతులు చెప్పింది ఆసక్తిగా విన్నారు.. సూచనలు.. సలహాలు స్వీకరించారు.. మీరు చెప్పింది నేను చేస్తా అంటూ వారి భరోసానిచ్చారు. గోపాలపురం నియో జకవర్గం నల్లజర్ల జాతీయ రహదారికి సమీపాన బుధవా రం జరిగిన రైతన్నా-మీకోసం కార్యక్రమం ఎవరూ ఊహిం చని విధంగా సభ ఏర్పాటు చేశారు. ఆరంభం నుంచి
జిల్లాలోని పలు స్టేషన్లపై ఆరోపణలు తీవ్రం గా వస్తున్నాయి.సామాన్యుల గోడు పట్టించుకు నే వారే కరువయ్యారు. న్యాయం చేయండి మహాప్రభో అని వెళితే.. మా ఇంటి కొస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికొస్తే ఏమిస్తారు అనే నాను డిని స్టేషన్లోని ఎవరి సామర్థ్యం కొద్దీ వారు నిజం చేస్తున్నారనే విమర్శలున్నా
జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.
సీఎం చంద్రబాబు రాకకు నల్లజర్ల ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.