Share News

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌..

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:44 AM

పి.గన్నవరం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై జాయింట్‌లు వద్ద మరమ్మతుల నిమిత్తం మంగళవారం నుంచి వా హనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీం తో వాహనదారులు ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేసిన మార్గంలో (పాత అక్విడెక్టుపై నుంచి రాక పోకలు సాగిస్తున్నారు. అయితే బస్సులు, భారీ వాహనాల రాకపోకలు మాత్రం పూర్తిగా నిలి పివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇ

పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై రాకపోకలు బంద్‌..
పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై పనులు ప్రారంభించిన దృశ్యం

మరమ్మతులు ప్రారంభం

ప్రత్యామ్నయంగా పాత అక్విడెక్టుపై రాకపోకలు

బస్సులు, భారీ వాహనాలు పూర్తిగా నిషేధం

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

పి.గన్నవరం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం కొత్త అక్విడెక్టుపై జాయింట్‌లు వద్ద మరమ్మతుల నిమిత్తం మంగళవారం నుంచి వా హనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీం తో వాహనదారులు ప్రత్యామ్నయంగా ఏర్పాటు చేసిన మార్గంలో (పాత అక్విడెక్టుపై నుంచి రాక పోకలు సాగిస్తున్నారు. అయితే బస్సులు, భారీ వాహనాల రాకపోకలు మాత్రం పూర్తిగా నిలి పివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. బస్సులపై రాకపోకలు సా గించే ప్రయాణికులు మాత్రం అక్విడెక్టు అవతల నుంచి ఇవతలకు కాళినడకన రాకపోకలు సాగిస్తున్నారు. అమలాపురం, రాజోలు వైపు వెళ్లే స్కూలు బస్సులు సైతం నిలిపివేయడంతో విద్యా ర్థులు సైతం బ్రిడ్జిపై నుంచి నడుచుకుని అవ తల వైపునకు వెళ్తున్నారు. కాగా పాత అక్వి డెక్టుపై ఉన్న రైలింగ్‌లు కొంత భాగం సినిమా షుటింగ్‌ నిమత్తం తీసివేయడంతో వాహన రాక పోకల నిమిత్తం తాత్కాలికంగా ఇనుప రైలింగ్‌ను ఏర్పాటు చేశారు. అయితే అక్విడెక్టుపై ప్రారం భమైన ఎక్స్‌ఫెన్షన్‌ జాయింట్‌లు పనులను డీఈ ప్రసాద్‌రాజు, ఏఈఈ బి.రమేష్‌ పరిశీలించి సం బంధిత కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం జాయింట్‌లు వద్ద ఎక్స్‌ఫెన్షన్‌ జాయిం ట్‌లు ఏర్పాటు నిమిత్తం కట్టర్లతో ఇరువైపులా కాంక్రీటును తొలగి స్తున్నారు. కాగా 40 రోజుల పాటు అక్విడెక్టుపై పనులు నిర్వహణ కారణంగా భారీ వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను అనుసరించడానికి ప్రధాన సెంటర్లలో ఇరిగేషన్‌ అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు.

వాహనాలను కప్పేస్తున్న దుమ్ము..

పాత అక్విడెక్టును పూర్తిగా విస్మరించడంతో పూర్తిగా అధ్వాన్నంగా మారింది. ఇటీవల అక్వి డెక్టుపై ఉన్న విశ్రాంతి బల్లలను సైతం తొల గించడంతో ఇసుక భారీగా పేరుకుపోయింది. బ ల్లలు తొలగించే సమయంలో పూర్తి స్థాయిలో శుభ్రం చేయలేదని పలు వురు ఆరోపిస్తున్నారు. వా హనాల రాకపోకల సమయంలో దుమ్ము, ధూళీ పైకి లేవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అ ధికారు లు పట్టించుకుని పాత అక్విడెక్టుపై పేరుకుపోయిన ఇసుకను తొలగిం చాలని వాహనదారులు కోరుతున్నారు.

బస్సుల రాకపోకల్లో మార్పులు

పి.గన్నవరం అక్విడెక్టుపై జాయింట్‌లు వద్ద మరమ్మతుల నిమిత్తం వాహనాల నిషేధం కార ణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకల్లో తాత్కా లికంగా మార్పులు చేశామని జిల్లా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు అధికారి ఎం.శ్రీనివాస్‌, రాజోలు డిపో మేనేజరు జి.జేమ్స్‌కుమార్‌ ఒక ప్రకట నలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాజోలు నుంచి పి.గన్నవరం అక్విడెక్టు ఇవతల వైపు (లంకల గన్నవరం వద్ద) వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు ఉంటుందని తెలిపారు. అలాగే పి.గన్న వరం సెంటర్‌ నుంచి రావులపాలెం, రాజ మ హేంద్రవరం వరకు ప్రతి 20 నిమిషాలకు బస్సు లు బయ లుదేరి వెళ్తాయని చెప్పారు. ప్రయా ణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అక్విడెక్టుపై మరమ్మతులు పూర్త య్యే వరకు ఇదే విధంగా బ్రిడ్జికి ఇరువైపులా బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు.

Updated Date - Feb 11 , 2026 | 12:44 AM