Share News

అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు లొంగుబాటు

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:07 PM

ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు.

అల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు లొంగుబాటు

పాడేరు, ఫిబ్రవరి 18: ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం జిల్లా ఎస్పీ బర్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా వినియోగించుకుని గౌరవప్రదమైన, శాంతియుత జీవితం గడపాలని లొంగిపోయిన మావోయిస్టులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ ప్రాయోజిత శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని వారికి సూచించారు. అలాగే ఇతర మావోయిస్టులు సైతం సమీప పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోవాలన్నారు. అలా కాకుంటే కుటుంబ సభ్యుల ద్వారా.. నేరుగా సీనియర్ పోలీస్ అధికారులను సంప్రదించాలని మావోయిస్టులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.


ఈ ఇద్దరు మావోయిస్టుల్లో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారని తెలిపారు. కడితే హిడిం అలియాస్ అంజు అలియాస్ కరుణ- డివిజినల్ ఏరియా కమిటీ మెంటర్ (DCM), బడ్చే భీమా అలియాస్ మనీష్ ఏరియా కమిటీ మెంటర్ (ACM)గా పని చేశారని ఎస్పీ వివరించారు. వీరిద్దరు పలు నేరాలలో నిందితులను పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు. మరో వైపు తాము లొంగిపోవడానికి గల కారణాలను ఈ ఇద్దరు మావోయిస్టులు వివరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల ఆపరేషన్లు తీవ్రతరం చేశారని చెప్పారు. కొత్త పోలీసు శిబిరాల ఏర్పాటు చేయడం వల్ల మావోయిస్టుల కదలికలు పరిమితం అయ్యాయని వివరించారు.


ఈ నేపథ్యంలో ప్రాణ భయం ఏర్పడిందని వివరించారు. మావోయిస్టుల పట్ల ప్రజల మద్దతు తగ్గిపోవడం కూడా ఒక కారణమన్నారు. అలాగే సిద్ధాంతాలపై విశ్వాసం కోల్పోయినట్లు చెప్పారు. నిరంతర లొంగుబాట్ల కారణంగా పార్టీ సిద్ధాంతాలపై నిరాశ పెరిగిందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో పలువురు సీనియర్ మావోయిస్టు నేతలు మరణించడంతో తమ కార్యకలాపాల తీవ్రంగా బలహీనపడ్డాయని చెప్పారు. ప్రభుత్వ పునరావాస విధానాలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఆకర్షణీయమైన లొంగుబాటు ప్రయోజనాలు - ఆర్ధిక సహాయం, భూమి, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కలగడంతో తీవ్రవాదాన్ని విడిచి జన జీవన స్రవంతిలోకి తిరిగి వచ్చామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ చేతిలో ఐ బొమ్మ రవి బెయిల్ ఆర్డర్ కాపీ

తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నేవీది కీలకపాత్ర: రాష్ట్రపతి

For More AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 02:09 PM