మితిమీరుతున్న సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:41 AM
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 10(ఆం ధ్రజ్యోతి): మితిమీరుతున్న సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏలూరురేంజ్ డీఐజి జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం తూర్పు గోదా వరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని బొమ్మూ రు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహకిషోర్‌తో కలిసి తనిఖీ చే
మహాశివరాత్రికి పటిష్ట బందోబస్తు
ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్
రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 10(ఆం ధ్రజ్యోతి): మితిమీరుతున్న సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక నిఘా పెట్టామని ఏలూరురేంజ్ డీఐజి జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం తూర్పు గోదా వరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌లోని బొమ్మూ రు పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహకిషోర్‌తో కలిసి తనిఖీ చేశారు. విలేకర్లతో ఐజీ మాట్లాడారు. జిల్లాలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా, యాంటీ డ్రగ్స్ రో డ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలపట్ల, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పోలీసింగ్‌లో టెక్నాలజీ పూర్తిగా వినియోగించాలన్నారు. మహాశివరాత్రికి భారీగా భక్తులు రాజమహేంద్రవరం గోదావరి స్నానాలకు వస్తారని రద్దీకి తగ్గట్టు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. డ్రోన్ కెమెరాలు, సోలార్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి క్యూల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాత్కాలిక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కోర్ట్ మానిటరింగ్ సెల్ నూతన భవనం ప్రారంభం
బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన కోర్ట్ మానిటరింగ్ సెల్ భవనాన్ని ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ ప్రారంభించారు. అదేవిధంగా సీసీ కెమెరా కం ట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. అనంతరం స్టేషన్ ప్రాం గణంలో మొక్కలు నాటారు. ఈ కా ర్యక్రమంలో ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య, సౌత్ డీ ఎస్పీ భవ్యకిషోర్, బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాధం, అనపర్తి సీఐ సుమంత్, ఎస్‌ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.