Share News

ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

ABN , Publish Date - Feb 12 , 2026 | 03:16 PM

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 తాటాకు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 13 కుటుంబాలు వారు నిరాశ్రయులయ్యాయి.

 ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..
Fire Accident

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఫిబ్రవరి 12: మామిడికుదురు మండలంలోని ఆల్ క్యాస్ట్ కాలనీలో ఈరోజు (గురువారం) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం వల్ల 13 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మరికొన్ని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా త్వరితగతినే మంటలను అదుపుచేశారు.


ఈ ప్రమాదంలో 13 కుటుంబాలకు చెందిన విలువైన గృహోపకరణాలు, వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఓ వ్యక్తి గ్యాస్ సిలిండర్ వెలిగించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక శాఖ అధికారులు ప్రస్తుతం ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పరిహారం, పునరావాసం కోసం సంబంధిత అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాద ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.


ఇవి కూడా చదవండి...

అమరావతి రాజధాని కాదు.. ఆంధ్రప్రజల భవిష్యత్: ఎమ్మెల్యే వెంకట్రాజు

చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రతిభపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 12 , 2026 | 03:50 PM