Home » Fire Accident
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న ఓ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లో ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైలులో సీ4 కోచ్‌లో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే కోచ్ నుంచి దిగిపోయారు. రైల్వేస్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి.. మంటలను అదుపు చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.
అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలోని అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కర్మాగారంలోని 440 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ట్రావెల్స్ బస్సు వేగంగా వెళుతోంది. అర్ధరాత్రి దాటడంతో ప్రయాణికులంతా ఆదమరిచి నిద్రపోతున్నారు. ఇంతలో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. వెంటనే బస్సును రోడ్డుపై ఆపి.. క్లీనర్, మరో డ్రైవర్‌ను నిద్రలేపాడు. ముగ్గురూ కలిసి ప్రయాణికులను బస్సు నుంచి దింపేశారు. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగసిపడి బస్సు దగ్ధమైంది. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, బస్సు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి పార్టీ సందర్భంగా ఓ బిల్డింగ్‌లో మంటలు చెలరేగటంతో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి 11 మంది మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు సజీవదహనం అయ్యారు.
హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మొగల్ ఖానాల వద్ద ఫర్నిచర్ గోదాముల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. దీంతో ఫర్నిచర్ కాలి బూడిదైంది.