Share News

అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ABN , Publish Date - Feb 16 , 2026 | 09:11 PM

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యంత్ర సామగ్రి, స్పేర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..

అన్నమయ్య జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
Fire Incident

అన్నమయ్య జిల్లా, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె ప్రాంతంలో గల నీరుగట్టువారిపల్లెలో అమృత ట్రేడర్స్ పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో సోమవారం ఆగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో దుకాణంలోని స్పేర్ పార్ట్స్, యంత్ర సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.


సుమారు రూ.10 లక్షల వరకు నష్టం వాటిళ్లిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి, పరిస్థితిని నియంత్రించారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దుకాణంలో సాంకేతిక పరికరాలు, విద్యుత్ సరఫరా తదితరాలను పరిశీలించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 09:16 PM