రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. సర్వీస్ సెంటర్‌లో మంటలు..
ABN , Publish Date - Feb 10 , 2026 | 06:16 AM
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించగా, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇంటర్‌నెట్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ కార్ల కంపెనీ సర్వీస్ సెంటర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు దగ్ధమయ్యాయి. రాజేంద్రనగర్ మారుతీ సుజుకీ సర్వీస్ సెంటర్‌లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ అగ్ని ప్రమాదం కారణంగా పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ప్రమాదంలో పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రెండు రోజుల క్రితం ఫోరెన్సిక్ ల్యాబ్‌లో..
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్ భవనం మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో ఆ ఫ్లోర్‌లోని కంప్యూటర్లు, ఫోరెన్సిక్ సంబంధిత కెమికల్స్‌తో సహా కీలకమైన పత్రాలు కాలి బూడిదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
అరబిందో ఫార్మా లాభం రూ.910 కోట్లు