Share News

అరబిందో ఫార్మా లాభం రూ.910 కోట్లు

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:58 AM

అరబిందో ఫార్మా డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.910 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం...

అరబిందో ఫార్మా లాభం రూ.910 కోట్లు

మొత్తం ఆదాయంలో 8 శాతం వృద్ధి

ఆదాయంలో అమెరికా మార్కెట్‌ వాటా 43 శాతం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అరబిందో ఫార్మా డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.910 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం లాభం రూ.846 కోట్లతో పోల్చితే 8 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం ఆదాయం కూడా 8.4 శాతం వృద్ధితో రూ.7,979 కోట్ల నుంచి రూ.8,646 కోట్లకు పెరిగింది. కీలక మార్కెట్లైన అమెరికా, యూర్‌పల్లో వివిధ ఉత్పత్తుల పోర్టుఫోలియో పటిష్ఠంగా ఉండటంతో పాటు డిమాండ్‌ పెరగటం ఎంతగానో కలిసి వచ్చిందని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ కే నిత్యానంద రెడ్డి వెల్లడించారు.

మొత్తం ఫార్ములేషన్‌ వ్యాపారం రూ.7,683 కోట్లు

కాగా ఈ కాలంలో మొత్తం ఫార్ములేషన్‌ వ్యాపారం 10.4 శాతం వృద్ధితో రూ.7,683 కోట్లుగా నమోదైందని కంపెనీ తెలిపింది. క్యూ3లో అమెరికా ఆదాయం 2.2 శాతం వృద్ధితో రూ.3,739 కోట్లకు చేరుకోగా యూరప్‌ రెవెన్యూలు 27.4 శాతం వృద్ధి చెంది రూ.2,703 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. దేశీయ ఫార్ములేషన్‌ విక్రయాలు రూ.74 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ మొత్తం రెవెన్యూలో అమెరికా వాటా 43.2 శాతంగా ఉంది. క్యూ3లో మొత్తం 9 ఔషధాలను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. యూఎ్‌సఎ్‌ఫడీఏ నుంచి 7 అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్స్‌ (అండా)కు ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది.


గరుడ రెన్యువబుల్స్‌లో 26 శాతం వాటా

సౌర, పవన విద్యుదుత్పత్తి విభాగంలోని గరుడ రెన్యువబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 26 శాతం వాటాను రూ.66 కోట్లకు కొనుగోలు చేసినట్లు అరబిందో ఫార్మా వెల్లడించింది. అలాగే విద్యుదుత్పత్తి వ్యయాలను తగ్గించుకోవటంతో పాటు ఈఎ్‌సజీ ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు గరుడతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. గరుడ రెన్యువబుల్స్‌.. ఎకోరెన్‌ ఎనర్జీ పైవేట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థగా ఉంది.

ఇవి కూడా చదవండి..

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..

బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 10 , 2026 | 05:58 AM