ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
ABN , Publish Date - Feb 09 , 2026 | 07:14 AM
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి నెపాన్ని భారత్‌పై నెట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఇస్లామాబాద్‌లోని షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా (అషూర్‌ఖానా)లో గుర్తు తెలియని ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకోవటంతో 69 మంది మరణించారు.
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి నెపాన్ని భారత్‌పై నెట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంది. ఇస్లామాబాద్‌లోని షియా ముస్లింలకు చెందిన ఖదీజతుల్ కుబ్రా మసీదు, ఇమాంబర్గా (అషూర్‌ఖానా)లో గుర్తు తెలియని ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకోవటంతో 69 మంది మరణించారు. 169 మంది గాయపడ్డారు. ఈ దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. అయినప్పటికీ పాక్ నేతలు మాత్రం భారత్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు (Pakistan minister allegations).
తాజాగా పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ భారత్‌ను నిందిస్తూ ఆరోపణలు చేశారు. తమ దేశంలోని ఉగ్ర సంస్థలకు భారత్ నిధులందిస్తోందని అన్నారు. తాజా దాడిలో ఐసిస్, తాలిబన్ల పేర్లు బయటకు వచ్చాయని, వారికి భారత్ నుంచే నిధులు, లక్ష్యాలు వస్తున్నాయని ఆరోపించారు. మొదట్లో ఒక్కో ఉగ్రవాదికి 500 డాలర్లు వచ్చేవని, ప్రస్తుతం 1500 డాలర్లు అందుతున్నాయని అన్నారు. వారి బడ్జెట్‌ను ఎవరో పెంచుతున్నారని అన్నారు. తాజా దాడిలో అఫ్గాన్ పౌరుడే ప్రధాన సూత్రధారి అని, అతడిని అరెస్ట్ చేశామని నఖ్వీ తెలిపారు (India Pakistan news).
ఈ దాడికి బాధ్యత వహిస్తూ వెంటనే ఎవరూ ప్రకటన చేయలేదు (Islamabad Bomb Blast). అయితే, ఇది తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) పని అయి ఉండొచ్చని పోలీస్ వర్గాలు తెలిపాయి. దాడికి పాల్పడిన వ్యక్తి పాకిస్థాన్ పౌరుడు కాదని పేర్కొన్నాయి. రెండు రోజుల పర్యటన కోసం పాకిస్థాన్‌కు వచ్చిన ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ ఇస్లామాబాద్‌లో ఉండగానే ఈ దాడి జరగటం సంచలనం సృష్టించింది. ఈ దాడిని భారత్ ఖండించింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్-2026: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం..