Share News

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:08 PM

రాజస్థాన్‌లో భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. భివాడి జిల్లాలోని కురుక్షేత్ర-కరోలి పారిశ్రామిక ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం..
Bhivadi Chemical Factory

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌‌లో (Rajasthan) భివాడిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు అందులోనే చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున భివాడిలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు ఎగసిపడ్డాయి.


అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీలో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. ప్రమాద స్థలంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సుమిత్ర మిశ్రా తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చైర్మన్ ఎన్నిక వేళ.. ఇస్నాపూర్‌లో బిగ్ ట్విస్ట్

మున్సిపల్ ఎన్నికలు.. చైర్మన్లు, మేయర్ల ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠ

For More TG News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 02:28 PM