Home » Rajastan
గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో నిందితుడు కళ్యాణ్ బైన్స్లాను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం టాయిలెట్‌కు వెళ్తానంటూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కిందపడి స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరిన సోదరిని చూడ్డానికి వెళ్లిన మహిళకు ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. మహిళ తలపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడ్డంతో తల పగిలింది. డాక్టర్లు ఆమెకు 12 కుట్లు వేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో సోమవారం చోటుచేసుకుంది.
చేతిలో పుస్తకాలు పట్టుకుని బడికి వెళ్లాల్సిన చిన్నారులు.. అక్కడ చీపుర్లు పట్టుకున్నారు. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో చిన్నారులకు గోశాలలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ -హైదరాబాద్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో విషాదం చోటుచేసుకుంది. అక్కడి ఓ వాటర్ ట్యాంక్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకెళితే..
బాయ్స్ హాస్టల్ మెస్‌లోకి మొసలి చొరబడ్డ ఘటన రాజస్థాన్‌లోని కోటలో చోటుచేసుకుంది. మొసలి మెస్‌లోకి వచ్చిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘర్ కే కాలేశ్ అనే వ్యక్తి ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఓపెన్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు ప్రేమించుకోగా, ఆర్టికల్ 21 జీవించే హక్కు కింద వివాహం చేసుకునేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇవ్వడంతో జులై 22న వీరి వివాహం జరగనుంది.
4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూలు భవనంలోని నాల్గవ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది.
నగలు దొంగిలించేందుకు ఇంట్లోకి చొరబడిన ఓ మహిళ చివరకు అదే ఇంట్లో బందీ అయిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. బయటపడేందుకు దారి కనిపించకపోవడంతో ఏకంగా ఇంటి యజమానినే బెదిరిస్తూ 'బట్టలు విప్పేస్తా.. పోలీసులకు ఫోన్ చేస్తా.. మీపై కేసు పెడతా' అంటూ హైడ్రామాకు తెరలేపింది.
రాజస్థాన్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.