రాజస్థాన్ - హైదరాబాద్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:28 PM
రాజస్థాన్ -హైదరాబాద్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్ - హైదరాబాద్ డ్రగ్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టయింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రెండు వేర్వేరు కేసుల్లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి 1.031 కిలోల నల్లమందును (ఓపీయం) స్వాధీనం చేసుకున్నారు. మరో 25 గ్రాముల మెఫెడ్రోన్ (MD) సీజ్ చేశారు. మియాపూర్, సైదాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు.
రాజస్థాన్ కేంద్రంగా హైదరాబాద్‌కు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. సప్లయర్లు, మధ్యవర్తులు, కొరియర్లు, డెలివరీ ఏజెంట్లతో ఈ నెట్‌వర్క్ నడిపిస్తున్నట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. ప్రైవేట్ బస్సులు, రైళ్లు, కార్ల ద్వారా ఈ డ్రగ్స్ తరలించారు. డ్రగ్స్ లావాదేవీలకు డిజిటల్ కమ్యూనికేషన్, యూపీఐ ట్రాన్సాక్షన్లు కొనసాగిస్తున్నట్లు ఈగల్ అధికారుల దర్యాప్తులో తేలింది. 2023 నుంచి రాజస్థాన్ లింక్ ఉన్న 78 డ్రగ్స్ ట్రాఫికింగ్ ప్రయత్నాలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.
యువతను కొరియర్లు, డెలివరీ ఏజెంట్లుగా ఈ డ్రగ్స్ ముఠాలు వాడుతున్నాయని విచారణలో తేలింది. రాజస్థాన్ లింక్ నెట్‌వర్క్‌లలో తరచుగా MD, ఓపీయం, డోడా చూరాను గుర్తించారు. మియాపూర్ కేసులో రాజస్థాన్‌కు చెందిన మహేందర్ కుమావత్ డ్రగ్స్ పంపించారు. బెంగళూరు మీదుగా హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలించినట్లు దర్యాప్తులో వెల్లడించారు. డ్రగ్స్ తరలింపులో MR ట్రావెల్స్ డ్రైవర్‌ను కూడా ఉపయోగించారు. నిందితుల దగ్గరి నుంచి మొబైల్స్, నగదు, వాహనాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి తెలంగాణకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న విస్తృత నెట్‌వర్క్‌పై ఈగల్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు
జీసీసీలకు తెలంగాణే బెస్ట్ డెస్టినేషన్: మంత్రి శ్రీధర్ బాబు
క్షుద్ర పూజల విషయంలో హరీశ్‌రావు వివరణ ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News