Share News

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:01 PM

ఖమ్మం జిల్లాలోని గోపాలపురం పాఠశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అండగా నిలబడ్డారు. ఆ పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆ పాఠశాలకు నూతన సొబగులు
Telangana CM Revanth Reddy

ఖమ్మం జిల్లా, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలోని గోపాలపురం పాఠశాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) అండగా నిలబడ్డారు. ఆ పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఖమ్మం కలెక్టర్ దివాకర్ పాఠశాలను సందర్శించారు.


ఉపాధ్యాయిని ఇందిరతో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ మాట్లాడారు. శిథిల భవనాల స్థానంలో కొత్త తరగతి గదులు నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ఉపాధ్యాయినిని అధికారులు అభినందించారు. సీఎం ఆదేశాలతో వెంటనే నిధుల విడుదల చేశారు. ఈ నిధులతో గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పథంలో కొనసాగనుంది.


వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 04:48 PM