Share News

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Aug 05 , 2026 | 10:51 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి షెడ్యూల్ బిజీబిజీగా ఉంది.

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
Telangana CM Revanth Reddy

ఢిల్లీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఈరోజు (బుధవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి షెడ్యూల్ బిజీబిజీగా ఉంది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో.. సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.


ఈ సమావేశంలో తెలంగాణ అభివృద్ధి గురించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, రహదారులకు శాఖాపరమైన అనుమతులపై కేంద్రమంత్రికి వినతిపత్రం ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, ఎస్‌ఆర్వీ ఆర్‌ డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు పాల్గొన్నారు.


కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..

కేంద్ర జ‌ల్‌శ‌క్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్రతో చ‌ర్చల‌కు జోక్యం చేసుకోవాల‌ని సీఆర్ పాటిల్‌ని కోరారు. 148 మీట‌ర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే ఆ రాష్ట్రం అంగీక‌రించిన విష‌యాన్ని సీఎం వివరించారు.150 మీట‌ర్ల ఎత్తుతో నిర్మాణానికి మ‌హారాష్ట్రను ఒప్పించాల‌ని విజ్ఞప్తి చేశారు. 150 మీటర్లకు పెంచినా ముంపు 1000 హెక్టార్లలోపు ఉంటుంద‌ని తెలిపారు. తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోత‌ల ఖ‌ర్చు లేకుండా గ్రావిటీతో నీటి స‌ర‌ఫ‌రాకు అవ‌కాశం ఉంటుంద‌ని వివరించారు. ఈ భేటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.


వార్తలు కూడా చదవండి...

మెటాపై కేసు నమోదు చేసిన ఆ డీసీపీని.. రేవంత్‌రెడ్డి బదిలీ చేశారు: కిషన్‌రెడ్డి

తెలంగాణలో అగమ్యగోచరంగా ప్రభుత్వాస్పత్రుల పరిస్థితి: హరీశ్‌రావు

మెటాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 12:15 PM