Home » Uttam Kumar Reddy Nalamada
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాలుగు ముక్కలైందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను విమర్శించేందుకు కూడా తమకు నోరు రావట్లేదని దెప్పిపొడిచారు.
మొంథా తుఫాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై తుపాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం గురించి చర్చ జరిగింది.
ధాన్యం కొనుగోలులో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస సౌకార్యాలు కలిపించాలని సూచించారు.
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆల్మట్టి డ్యాం పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని చెప్పిన ఉత్తమ్.. ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై వాదనలు వినిపిస్తానని..
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం తక్షణమే సవరణ డీపీఆర్‌ను సిద్ధం చేసి, అనుమతుల కోసం దాఖలు చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో తెలంగాణ ఒకటి అని, రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని డెన్మార్క్ రాయబారి రాస్మస్ అబిల్డ్‌గార్డ్ క్రిస్టెన్‌సన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వంలో బాధ్యతా రహితంగా నిర్మించిన కాళేశ్వరం తప్పిదాలకు నాటి సీఎం కేసీఆరే బాధ్యులని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం హడావుడిగా చర్చ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమైందని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్‌కు, తనకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 8బీ కింద నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. 8బీ కింద నోటీసులు ఇవ్వకపోతే రిపోర్టు చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందని మాజీ మంత్రి హరీష్‌రావు గుర్తుచేశారు.
కేబినెట్ అనుమతి లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్లిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం పూర్తి చేయడానికి రూ.లక్షా 27 వేలకోట్లు అవసరమని పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదని వెల్లడించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ నాలుగేళ్లలోనే కూలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ప్రాజెక్టులకు కీలక అనుమతులు సాధించినప్పటికీ వాటికి కేంద్ర సహాయం కోరే దిశగా అధికారుల అడుగులు పడటం లేదు.