Almatti Dam : ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ వ్యతిరేకం: ఉత్తమ్
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:09 PM
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆల్మట్టి డ్యాం పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని చెప్పిన ఉత్తమ్.. ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుపై వాదనలు వినిపిస్తానని..
సూర్యాపేట, సెప్టెంబర్ 21 : ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని(Almatti Dam Telangana Opposition) తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆల్మట్టి డ్యాం పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని చెప్పిన ఉత్తమ్.. ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాం(Supreme Court Almatti Case) పెంపుపై వ్యతిరేకమని వాదనలు వినిపిస్తానని వెల్లడించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వయిరీ జరుగుతుందని, ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుమ్మిడి హట్టి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి నది జలాలలో తెలంగాణకి రావాల్సిన వాటా కోసం ఏ రాష్ట్రంతోనైనా పోరాడుతామని కూడా ఉత్తమ్ తేల్చి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కృష్ణానది, గోదావరి నది జలాల్లో( Godavari River Water Dispute) తెలంగాణకు రావాల్సిన వాటాలో అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి