Share News

H-1b 4chan Block Bookings: హెచ్-1బీ వీసాదారులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ భారీ ఆపరేషన్

ABN , Publish Date - Sep 21 , 2025 | 03:11 PM

ట్రంప్ వీసా ప్రకటన తరువాత అమెరికాకు తరలి వెళుతున్న భారతీయులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ ఓ భారీ ఆపరేషన్ జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విమాన టిక్కెట్‌లకు కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు ప్రయత్నించినట్టు తెలిసింది.

H-1b 4chan Block Bookings: హెచ్-1బీ వీసాదారులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ భారీ ఆపరేషన్
4Chan booking block

ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు ప్రకటన ఎన్నారైలను ఉక్కిరిబిక్కిరి చేసింది. నిబంధనల్లో అస్పష్టత, వెంటనే అమెరికాకు తిరిగి రావాలంటూ ఎన్నారైలకు టెక్ కంపెనీల పిలుపు కారణంగా భారతీయులు అనేక మంది నానా రకాల ఇబ్బందులు పడ్డారు. సెలవులకు ఇండియాకు వచ్చిన భారతీయులు సహా వివిధ దేశాల్లోని ఎన్నారైలు అమెరికాకు క్యూకట్టారు. ఫలితంగా విమాన టిక్కెట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు రెట్టింపయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయులను అమెరికాకు రాకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి (Operation Clog the Toilet).

4Chan ఆన్‌లైన్ ఫోరమ్ యూజర్లు కొందరు విమాన టికెట్లను బ్లాక్ చేసి భారతీయులకు టిక్కెట్ల దొరకకుండా చేశారని తెలుస్తోంది. టిక్కెట్లు కొంటామంటూ వాటిని రిజర్వ్‌లో పెట్టి ఆ తరువాత కొనకుండా వదిలేశారట. ఫలితంగా ఎన్నారైలకు టిక్కెట్ల కొరత మరింత పెరిగిందట. ట్రంప్ ప్రకటన తరువాత భారత్-అమెరికా విమాన టిక్కెట్లు దాదాపు రెట్టింపైన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన రెండు గంటల్లోనే ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వన్ వే విమాన టిక్కెట్ ధర రెట్టింపై రూ.80 వేలకు చేరుకుంది (4Chan booking block).


మీడియా కథనాల ప్రకారం, 4Chan అనే ఆన్‌‌లైన్ వేదిక యూజర్లు ‘ఆపరేషన్ క్లాగ్ ది టాయ్‌లెట్’ పేరిట టిక్కెట్లను రిజర్వ్‌లో పెట్టి కృత్రిమ కొరత సృష్టించారు. ఫలితంగా టిక్కెట్ల ధరలు పెరిగాయట. ‘హెచ్-1బీ వీసా వార్త భారతీయులకు ఇప్పుడే తెలిసింది. వారు అమెరికాకు రావొద్దనుకుంటే టిక్కెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేయండి’ అని సదరు ఆన్‌లైన్ వేదికలో ఓ యూజర్ రాసుకొచ్చాడు. టిక్కెట్‌లను ఎలా బ్లాక్ చేయాలో కూడా కొందరు సవివరంగా పోస్టు పెట్టారు. భారత్-అమెరికా మధ్య పాప్యులర్ విమాన రూట్‌లను కనుక్కుని టిక్కెట్ చెక్ ఔట్ (కొనుగోలు) ప్రాసెస్ మొదలెట్టాలని, కానీ కోనుగోలు పూర్తి చేయకుండా సీట్లను 15 నిమిషాల పాటు బ్లా్క్ చేయాలని పోస్టులు పెట్టారు (air ticket price spike).

‘టిక్కెట్‌లను మాత్రం కొనద్దు. జస్ట్ టిక్కెట్ బుకింగ్ విండోను అలాగే 15 నిమిషాల పాటు వదిలేయండి. మళ్లీ మళ్లీ ఇదే చేయండి. ఇందుకోసం సీట్ హోల్డ్ ఫీచర్‌ను వినియోగించుకోండి’ అని రాసుకొచ్చారు. విమానాల్లో ఇలా సీట్లను హోల్డ్‌లో పెట్టి వీలైనంత మందిని అడ్డుకోవడమే లక్ష్యం అని యూజర్లు రాసుకొచ్చారు. ‘నేను ఏకంగా 100 సీట్లను లాక్ చేసి పెట్టా’ అని ఓ యూజర్ పోస్టు పెట్టాడంటే ఈ ఆపరేషన్ ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చని కొందరు ఆన్‌లైన్‌లో కామెంట్ చేస్తున్నారు. అయితే, వీసా ఫీజు పెంపు కొత్త దరఖాస్తులకే వర్తిస్తుందని అమెరికా క్లారిటీ ఇచ్చాక పరిస్థితి కొంత వరకూ సద్దుమణిగింది. అయితే, తాజా రూల్‌తో మధ్యస్థాయి నిపుణులకు అమెరికా కలలు కల్లలేనని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

హెచ్-1బీ వీసా పెంపును సమర్థించుకున్న అమెరికా.. వాస్తవాలు ఇవిగో అంటూ ప్రకటన

భారత్‌తో యుద్ధంలో పాక్‌కు అండగా సౌదీ అరేబియా.. పాక్ రక్షణ మంత్రి ప్రకటన

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 21 , 2025 | 03:22 PM