Home » H-1B Visa
ట్విట్టర్‌లో సంక్లిష్ఠ సమస్యలను భారతీయులు, చైనీయులు కలిసి పరిష్కరించారని ఎక్స్ మాజీ ఉద్యోగి ఎస్తర్ క్రాఫర్డ్ కామెంట్ చేశారు. వలస వ్యతిరేక కామెంట్స్ చేసే ముందు ఈ విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు.
అమెరికాకు చెందిన రెండు ప్రముఖ కంపెనీలు భారత సంతతి వ్యక్తులను సీఈఓలుగా నియమించుకున్నాయి. టెలికం దిగ్గజం టీ-మొబైల్ శ్రీనివాసన్‌ను, పానీయాల సంస్థ మాల్సన్ కూర్స్.. రాహుల్ గోయల్‌ను సీఈఓలుగా ఎంపిక చేశాయి.
విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించ గలిగేలా అమెరికాలో కంపెనీ ఏర్పాటు చేసి తన కలను నెరవేర్చుకుంటానని ఓ చైనా యువకుడు చెప్పాడు. హెచ్-1బీ వీసా పెంపు తరువాత తానీ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాడు. ఇంతకాలం అమెరికాలో భయం భయంగా బతికానని, ఇకపై మరింత స్వేచ్ఛగా బతుకుతానని అన్నాడు.
హెచ్-1బీ వీసాకు వీసాకు పొటీగా చైనా కే-వీసాను ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి దీన్ని లాంచ్ చేయనుంది. ప్రపంచవ్యా్ప్తంగా స్టెమ్ రంగాల యువ వృత్తి నిపుణులు, విద్యార్థులను ఆకర్షించేందుకు ఈ వీసాను చైనా ప్రారంభించింది.
మొదటి త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8గా ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుర్తుచేశారు. ఆర్థికవేత్తల అంచనాలను మించి ఇండియా వృద్ధి అప్రతిహతంగా సాగుతోందన్నారు. ఏదిఏమైనా భారత్ విజేతగా నిలవడం ఖాయమన్నారు.
ట్రంప్ వీసా ప్రకటన తరువాత అమెరికాకు తరలి వెళుతున్న భారతీయులను అడ్డుకునేందుకు ఆన్‌లైన్ ఓ భారీ ఆపరేషన్ జరిగినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విమాన టిక్కెట్‌లకు కృత్రిమ కొరత సృష్టించేందుకు కొందరు ప్రయత్నించినట్టు తెలిసింది.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపును అమెరికా ప్రభుత్వం తాజాగా సమర్థించుకుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయనేందుకు ఆధారాలుగా పలు గణాంకాలను శ్వేత సౌధం తాజాగా విడుదల చేసింది.
హెచ్-1బీ వీసా ఫీజు పెంపుపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. అభివృద్ధిలో ఇరు దేశాల భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో కలిసి చర్చించుకుని ముందడుగు వేయాలంటూ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ట్రంప్ ప్రభుత్వ హెచ్-1బి వీసా సిస్టమ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని, ముఖ్యంగా లబ్ధిదారులు గణనీయంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రభావం ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
ట్రంప్ తొలిసారి దేశాధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని ట్రంప్ దృష్టికి తీసుకురాకపోవడంపై మోదీని తాను 2017లోనే ప్రశ్నించానని రాహుల్ గుర్తుచేశారు. మోదీ ఓ బలహీన ప్రధాని అని రాహుల్ ఎద్దేవా చేశారు.