China man H-1b Advice: అమెరికాను వీడుతున్నా.. ఇకపై చేయాల్సింది ఇదే.. హెచ్-1బీ వీసాపై చైనా యువకుడి కామెంట్
ABN , Publish Date - Sep 22 , 2025 | 09:12 AM
విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించ గలిగేలా అమెరికాలో కంపెనీ ఏర్పాటు చేసి తన కలను నెరవేర్చుకుంటానని ఓ చైనా యువకుడు చెప్పాడు. హెచ్-1బీ వీసా పెంపు తరువాత తానీ నిర్ణయం తీసుకున్నట్టు వివరించాడు. ఇంతకాలం అమెరికాలో భయం భయంగా బతికానని, ఇకపై మరింత స్వేచ్ఛగా బతుకుతానని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజును అమాంతం అమెరికా పెంచేయడం భారతీయులు, చైనీయులపై అత్యధిక ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఓ చైనా యువకుడు తాను అమెరికాను వీడుతున్నానంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. హెచ్-1బీ వీసా కోల్పోయే అవకాశం ఉన్న వారు ఇకపై చేయాల్సింది ఇదేనంటూ అతడు తన ఆలోచనను నెట్టింట పంచుకున్నాడు (Chinese Amazon engineer quits).
ప్రస్తుతం ఓపీటీ ఆధారంగా ఉపాధి పొందుతున్న అతడు ఈ అనుమతి గడువు ఇంకా 18 నెలలే ఉందని చెప్పుకొచ్చాడు. హెచ్-1బీ వీసా లాటరీకి మరో అవకాశం ఉన్నా దాన్ని వినియోగించదలుచుకోలేదని చెప్పారు. నిరంతరం ఆందోళన మధ్య బతికే కంటే సొంత దేశానికి వెళ్లిపోవడం బెటరనే నిశ్చయానికి వచ్చినట్టు చెప్పాడు. గత మూడేళ్లు వీసా కారణంగా ఆందోళనతోనే గడిచిపోయాయని చెప్పాడు (H-1B visa fee hike impact).
టాప్ టెక్ కంపెనీలో సంవత్సరానికి 1.8 లక్షల డాలర్లు సంపాదిస్తున్నా నిత్యం ఆందోళన వెంటాడేదని అన్నాడు. ఇకపై అమెరికాలో ఓ కంపెనీ ఏర్పాటు చేస్తానని, విదేశాల్లో ఉంటూ కంపెనీ కార్యకలాపాలను రిమోట్‌గా నిర్వహిస్తానని చెప్పుకొచ్చాడు. దీని వల్ల తనకు వైద్య ఖర్చులు, జీవన వ్యయాలు మిగులుతాయని, మరింత స్వేచ్ఛ దొరుకుతుందని అన్నాడు (foreign worker anxiety US).
‘ఆర్థిక స్వాతంత్ర్యం, మనశ్శాంతి కోసం అమెరికాకు వచ్చాను. కానీ ఇక్కడ నిత్యం భయంలోనే మగ్గిపోతున్నాను. కనీసం ఊపిరి తీసుకునే స్వేచ్ఛ కూడా లేనట్టు అనిపిస్తోంది. స్టూడెంట్ వీసా, ఓపీటీ, హెచ్-1బీ, గ్రీన్ కార్డు.. ఇవి నిరంతరం ఆందోళన కలిగించే ప్రయాసగా మారింది. ఇకపై అమెరికా కలలు, డాలర్ డ్రీమ్స్‌కు నిర్వచనం మారింది. ఇక ప్రపంచంలో ఎక్కడైనా ఉంటూ అమెరికా డాలర్లలో ఆర్జించడమే అసలు లక్ష్యం. విదేశాల్లో ఎక్కడ నుంచైనా కార్యకలాపాలు నిర్వహించేలా అమెరికాలో ఓ కంపెనీ రిజిస్టర్ చేస్తా. డాలర్లలో ఆర్జిస్తూ అసలైన స్వాతంత్ర్యాన్ని ఎంజాయ్ చేస్తాయి. ఫాంగ్ కంపెనీల ఉద్యోగి నుంచి ఓ కంపెనీ నిర్వాహకుడిగా మారేందుకు తీసుకున్న ఈ నిర్ణయం బహుశా నా జీవితంలో అత్యుత్తమమైనది కావొచ్చు’ అని అతడు అన్నాడు.
ఇది కూడా చదవండి:
ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెడ్ షీట్‌ల చోరీ.. ప్రయాణికుల నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్
పెంపుడు జంతువుల మధ్య పోట్లాట.. విడాకులకు సిద్ధమైన యువ జంట