AC Coach Bedsheets Theft: ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెడ్ షీట్‌ల చోరీ.. ప్రయాణికుల నిర్వాకం.. నెట్టింట వీడియో వైరల్
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:04 PM
ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో జర్నీ చేస్తున్న కొందరు ప్రయాణికులు అక్కడి బెడ్ షీట్స్‌లను చోరీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కొందరి బుద్ధి ఎప్పటికీ మారదంటూ జనాలు మండిపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ధనవంతులు ప్రయాణించే ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో జర్నీ చేసిన కొందరు ప్రయాణికులు అక్కడి బెడ్ షీట్స్‌ను దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన జనాలు వారిని తిట్టిపోస్తున్నారు. సిగ్గుమాలిన పని చేశారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఒడిశాలో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన జరిగింది (1st AC coach bedsheets theft).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ ప్రయాణికులు కొందరు బెడ్ షీట్స్, దుప్పట్లను చోరీ చేసి రెడ్ హ్యండెడ్‌గా టీటీఈకి దొరికిపోయారు. రైల్వే సిబ్బంది వారిని ఫ్లాట్ ఫామ్ పైనే నిలబెట్టి దుమ్ము దులిపేశారు. లగేజీలో వారు పెట్టుకున్న రైల్వే బెడ్ షీట్స్‌ను వెనక్కు తీసుకున్నారు. ‘వీళ్ల బ్యాగుల్లో ఎన్ని బెడ్ షీట్స్, టవల్స్ ఉన్నాయో చూడండి.. మొత్తం నాలుగు జతలను చోరీ చేసే ప్రయత్నం చేశారు. వాటిని తిరిగి ఇవ్వండి లేదా రూ.780ల ఫైన్ కట్టండి’ అని రైల్వే సిబ్బంది హెచ్చరించారు. ఓ మహిళ, ఆమెతోపాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు ఈ చోరీ చేశారు (Purushottam Express stealing video).
సిబ్బంది నిలదీస్తుండగా మహిళ తనయుడు వారికి సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తమ తల్లి తెలియక వాటిని తన బ్యాగులో సర్ది ఉంటుందని అన్నారు. కానీ, రైల్వే సిబ్బంది మాత్రం ఈ వివరణతో అసలేమాత్రం సంతృప్తి చెందలేదు. టీటీఈ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. చెప్పినట్టు చేయకపోతే రైల్వే యాక్ట్ ప్రకారం తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు (railway bedsheets towels stolen).
ఈ వీడియోను ఓ నెటిజన్ నెట్టింట షేర్ చేస్తూ ఆ ప్రయాణికులు తిట్టిపోశారు. ‘ఏసీ కోచ్ ప్రయాణించడమంటేనే గర్వించదగ్గ విషయం. అయినా కొందరిలో పాత బుద్ధులు పోవు. ఇలాంటి కోచ్‌ల్లో కూడా వీరు చోరీలు చేస్తుంటారు. ప్రయాణికులకు అదనపు సౌకర్యం కల్పించేందుకు ఇచ్చే బెడ్ షీట్స్‌ను చోరీ చేస్తుంటారు’ అని మండిపడ్డారు. ఇక జనాలు కూడా ఈ వీడియోను చూసి ఫైరైపోయారు. ఇది దిక్కుమాలిన పని అని, రోతపుడుతోందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి:
పెంపుడు జంతువుల మధ్య పోట్లాట.. విడాకులకు సిద్ధమైన యువ జంట
అమెరికా కల నెరవేరిందని సంబరపడుతూ టెకీ పోస్టు.. దీన్ని ట్రంప్ చూస్తే..