H-1b Visa: అమెరికా కల నెరవేరిందని సంబరపడుతూ టెకీ పోస్టు.. దీన్ని ట్రంప్ చూస్తే..
ABN , Publish Date - Sep 20 , 2025 | 09:37 PM
హెచ్-1బీ వీసా ఫీజు పెంపునకు కొద్ది గంటల ముందు ఓ టెకీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టును ట్రంప్ గనుక చూస్తే ఇక చెడుగుడే అంటూ జనాలు నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హెచ్-1బీ వీసా ఫీజు పెంచుతూ ట్రంప్ ప్రకటించిన రోజే తన అమెరికా కల నెరవేరినందుకు సంబరపడుతూ ఓ టెకీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ట్రంప్ చేసిందేంటో గుర్తు చేస్తూ జనాలు పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టడంతో అతడు నాలిక కరుచుకున్నాడు. ప్రస్తుతం ఇది నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
జతిన్ మలిక్ అనే వ్యక్తి ఈ పోస్టు పెట్టారు. తన జీవితానికి సంబంధించి ఓ అప్‌డేట్ ఇస్తున్నానని సంబరపడిపోతూ చెప్పారు. ఇటీవలే శాన్ ఫ్రాన్‌సిస్కోకు రిలొకేట్ అయినట్టు చెప్పాడు.
దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడి పొరపాటు ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. కామెంట్స్‌లో రచ్చ రచ్చ చేశారు. ట్రంప్ వీసా ఫీజులు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇలా భారీగా స్పందన రావడం అతడు కాసేపటికి మళ్లీ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఈ అప్‌డేట్ ఇచ్చేందుకు ఇంత కంటే చెత్త సమయం మరొకటి ఉండదేనమో అంటూ నెత్తి బాదుకున్నాడు.
ఇక జతిన్ పోస్టుపై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. అక్కడ ఊరంతా తగలబడుతున్నా నీకు తెలియకపోతే ఎలా బ్రదర్ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నావంటూ మరికొందరు సెప్టెంబర్ 21 డెడ్ లైన్ గురించి ప్రస్తావించారు. ఈ పోస్టును గనుక ట్రంప్ చూస్తే నీకు చుక్కలే అని మరికొందరు సరదా వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసా గడువు మూడేళ్లూ జాగ్రత్తగా ఉండాలని అతడికి మరికొందరు సూచించారు. అమెరికాలో లైఫ్‌ను ఆస్వాదించడంతో పాటు వీలైనంతగా సంపాదించుకోవాలని అన్నారు. మూడేళ్ల తరువాత మళ్లీ వీసా రెన్యూ అయితే సరే సరి లేకపోతే డబ్బుతో ఇండియాకు తిరిగొచ్చేయాలని సూచించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
కాలుపైకాలేసి స్కూటీపై కూర్చుని డ్రైవింగ్.. పోతావ్ జాగ్రత్త అంటున్న జనాలు
చైనాలో కొత్త విధానం.. పబ్లిక్ బాత్రూమ్స్‌లో టాయిలెట్ పేపర్ కోసం యాడ్ చూడాల్సిందే