Toilet Paper-Ads Watching: చైనాలో కొత్త విధానం.. పబ్లిక్ బాత్రూమ్స్‌లో టాయిలెట్ పేపర్ కోసం యాడ్ చూడాల్సిందే
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:15 AM
చైనాలోని కొన్ని పబ్లిక్ వాష్‌రూమ్స్‌లో టాయిలెట్ పేపర్ వాడుకునేందుకు యాడ్స్ చూడటాన్ని తప్పనిసరి చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై విమర్శలు వస్తున్నా ప్రభుత్వాలు సమర్థించుకునే ప్రయత్నం చేశాయి. టాయిలెట్ పేపర్ వృథాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: యూట్యూబ్ ఫ్రీ అకౌంట్ ఉన్న వాళ్లు వీడియో చూసే ముందు కొన్ని యాడ్స్ చూడక తప్పదు. పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం యాడ్‌ల బెడద ఉండదు. అయితే, పబ్లిక్ వాష్‌రూమ్స్‌లో టాయిలెట్ పేపర్ వినియోగానికి కూడా సరిగ్గా ఇదే నిబంధన అమలు చేయడం ప్రస్తుతం విమర్శలకు దారి తీసింది. చైనాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది (China toilet paper ad requirement).
చైనాలో డిజిటలీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రోజువారి పనులను కూడా మానెటైజ్ చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు కొత్త కొత్త ఐడియాలు వేస్తున్నాయి. ఇందులో భాగంగా పబ్లిక్ బాత్రూమ్స్‌లో టాయిలెట్ పేపర్ వినియోగానికి, యాడ్స్‌కు లంకెపెట్టాయి. ఈ వాష్‌రూమ్స్‌లోకి వెళ్లాక టాయిలెట్ పేపర్ కావాలనుకుంటే డిస్పెన్సర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి యాడ్‌ను చూడాలి. వీడియో పూర్తయ్యాక ఆ యంత్రం నుంచి టాయిలెట్ పేపర్ రిలీజ్ అవుతుంది. ఇది వద్దనుకున్న వారు రూ.5 చెల్లిస్తే యాడ్స్ బెడద లేకుండా టాయిలెట్ పేపర్‌ను వాడుకోవచ్చు (public restrooms China QR code ad).
ఈ తీరుపై సహజంగానే నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. మానవ సమాజ భవిష్యత్తు ఇక అంధకారమయమేనంటూ అనేక మంది కామెంట్ చేశారు. ఫోన్‌లో చార్జింగ్ అయిపోయినా, ఇంటర్నెట్ కట్ అయినా లేదా చేతిలో చిల్లర లేకపోయినా పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు ( toilet paper dispensing China).
అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం తమ చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాయి. పబ్లిక్ టాయిలెట్‌లో జనాలు టాయిలెట్ పేపర్లను అధికంగా వినియోగిస్తున్నారని చెప్పాయి. ఈ వృథాను అరికట్టేందుకు నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేశాయి.
2017లో కూడా చైనా ఇలాంటి పని చేసి విమర్శల పాలైంది. బీజింగ్‌లోని హెవెన్ పార్క్ టెంపుల్‌లో టాయిలెట్ పేపర్ చోరిని అరికట్టేందుకు మనుషుల ముఖాలను గుర్తుపట్టే సామర్థ్యం ఉన్న టాయిలెట్ పేపర్ డిస్పెన్సర్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఇవి వ్యక్తుల ముఖాలను గుర్తుపెట్టుకోగలవు. ఒక వ్యక్తికి కొద్ది మొత్తంలో టాయిలెట్ పేపర్ ఇచ్చాక మళ్లీ తొమ్మిది నిమిషాల తరువాతే ఆ వ్యక్తికి రెండోసారి టాయిలెట్ పేపర్ డిస్పెన్స్ చేసేలా వీటిని ప్రోగ్రామ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
హెచ్-1బీ వీసా పొరపాటు.. ఇలా చేస్తే జీవితం తలకిందులే
ఆ పుట్టుమచ్చ గురించి ఎలా తెలిసింది.. నానో బనానా ఫొటోతో మహిళకు షాక్