Share News

H-1b Visa Mistake: హెచ్-1బీ వీసా పొరపాటు.. ఇలా చేస్తే జీవితం తలకిందులే

ABN , Publish Date - Sep 18 , 2025 | 01:27 PM

హెచ్-1బీ వీసా గ్రేస్ పీరియడ్ నిబంధనను తప్పుగా అర్థం చేసుకున్న ఓ భారతీయుడు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా జనాలు అతడిని మూర్ఖుడంటూ తిట్టిపోస్తున్నారు.

H-1b Visa Mistake: హెచ్-1బీ వీసా పొరపాటు.. ఇలా చేస్తే జీవితం తలకిందులే
H-1B 60-day grace period Violation

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ప్రస్తుత పరిస్థితుల్లో వీసా నిబంధనలపై ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ రెడిట్‌లో ఓ వ్యక్తి పోస్టు పెట్టారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హెచ్-1బీ వీసా ఉన్న తన ఫ్రెండ్ జాబ్ కోల్పోయాక ఎలాంటి మిస్టేక్ చేశాడో చెబుతూ అతడీ పోస్టు పెట్టాడు (H-1B 60-day grace period).

నెటిజన్ పెట్టిన పోస్టు ప్రకారం, అతడి మిత్రుడు హెచ్-1బీ వీసా నిబంధనలను పొరపాటుగా అర్థం చేసుకుని చివరకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. నిబంధనల ప్రకారం, హెచ్-1బీ వీసాదారులు జాబ్ కోల్పోయాక 60 రోజుల్లో మళ్లీ కొత్త జాబ్ వెతుక్కోవాలి. లేకపోతే అమెరికాను వీడాల్సి ఉంటుంది. కానీ ఈ గడువు విషయంలో అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 60 రోజుల నిబంధనను అంత స్ట్రిక్ట్‌గా అమలు చేయరని అనుకున్నాడు. చివరకు జాబ్ దొరకకపోవడంతో డెడ్‌లైన్ ముగిశాక అతడు అమెరికాను వీడాల్పి వచ్చింది. అప్పటికే అమెరికా అధికారులు అతడికి నోటీసుల పంపించారు (immigration trouble H-1B India).


వీసా గడువుకు మించి అమెరికాలో ఉన్నట్టు, నిబంధనలను ఉల్లంఘించిట్టు అతడి వివరాలను రికార్డుల్లోకి ఎక్కించారు. ఇకపై అతడు ఎప్పుడు అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకున్నా ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని అతడి స్నేహితుడు చెప్పుకొచ్చారు. మరోసారి వీసా పొందే అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని అన్నాడు. ‘ఒక్కసారి మీ 60 రోజుల గడువు ముగిసిందంటే మీ వీసా రద్దయినట్టే. ఆ తరువాత అమెరికాలో కొనసాగితే చిక్కుల్లో పడ్డట్టే. ఇది చాలా పెద్ద ఉల్లంఘన. నా ఫ్రెండ్ ఇదే మిస్టేక్ చేశాడు’ అని అతడు చెప్పుకొచ్చాడు ( visa misunderstanding).

ఇక ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వీసా గ్రేస్ పీరియడ్ నిబంధనను ఉల్లంఘించినందుకు అతడిని అనేక మంది తిట్టిపోశారు. అతడు మూర్ఖుడంటూ మండిపడ్డారు. అమెరికా వలసల నిబంధనలను లైట్ తీసుకునే వాళ్లంతటి మూర్ఖులు మరొకరు ఉండరని కామెంట్ చేశారు. చేజేతులా జీవితాన్ని తలకిందులు చేసుకున్నాడని తిట్టిపోశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఆ పుట్టుమచ్చ గురించి ఎలా తెలిసింది.. నానో బనానా ఫొటోతో మహిళకు షాక్

శాలరీ పెంచడం ఇష్టం లేక ఉద్యోగిని తొలగించిన కంపెనీకి భారీ షాక్

Read Latest and Viral News

Updated Date - Sep 18 , 2025 | 01:32 PM