Nano Banana Creepy Trend: ఆ పుట్టుమచ్చ గురించి ఎలా తెలిసింది.. నానో బనానా ఫొటోతో మహిళకు షాక్
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:54 PM
నానో బనానా ఇచ్చిన ఫొటోలో తన పుట్టుమచ్చ చూసుకుని యువతి షాకైపోయింది. ఈ మచ్చ గురించి యాప్‌కు ఎలా తెలిసిందో అని షాకైపోతూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఇది ప్రస్తుతం తెగ ట్రెండవుతోంది. జనాలను షాక్‌కు గురి చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం భారత్‌లో జనాలు బనానా ఏఐ శారీ ట్రెండ్‌ను ఫాలో అయిపోతున్నారు. తాము చీరలు ధరించి ఉన్నట్టు నానో బనానా టూల్ రూపొందించిన ఫొటోలను చూసుకుని తెగ మురిసిపోతున్నారు. కానీ ఈ ట్రెండ్ ఓ యువతికి ఊహించని షాకిచ్చింది. నానో బనానా ఫొటోలో తన పుట్టుమచ్చ చూసుకుని ఆమె షాకైపోయింది. దీని విషయం ఏఐకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోయింది. ఆన్‌లైన్‌లో ఇలా ఫొటోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కూడా జనాలను ఆమె హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ ట్రెండవుతోంది (Gemini saree trend creepy).
తనకెదురైన అనుభవాన్ని సదరు యువతి ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘నేనూ నానో బనానాతో ఓ ఫొటో చేయించుకున్నాను. ఆ ఫొటోలో పుట్టుమచ్చ కనిపించడంతో షాకయిపోయాను. నాకు చేతిపై పుట్టుమచ్చ ఉన్నది నిజమే కానీ నేను అంతకుముందు అప్‌లోడ్ చేసిన ఫొటోలో అది కనిపించకుండా ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి. మరి యాప్‌కు నా పుట్టుమచ్చ గురించి ఎలా తెలిసింది? ఆలోచించేకొద్దీ ఇదంతా చాలా తేడాగా అనిపించింది. కాబట్టి మీరూ జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని కామెంట్ చేసింది (Nano Banana AI edits).
ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. తమకు ఇలాంటి అనుభవం ఎదురైందని ఓ వ్యక్తి అన్నారు. ‘అన్ని యాప్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. జెమినై గూగుల్‌కు చెందినది. మీ ఫొటోలు, వీడియోలు అన్నీ గూగుల్‌కు తెలుసు. దాని ఆధారంగానే వాస్తవానికి దగ్గరగా ఉండే ఫొటోలను ఏఐ సృష్టించగలుగుతోంది’ అని అన్నారు. ‘ఏఐ ఇలాగే పనిచేస్తుందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. డిజిటల్ ప్రపంచంలో మీరు గతంలో అప్‌లోడ్ చేసిన ఫొటోలు ఇతర సమాచారం ఆధారంగా కొత్త చిత్రాలను సృష్టిస్తుంది. కాబట్టి మీరు కొత్త ఫొటో క్రియేట్ చేయమననప్పుడు పాత ఫొటోలన్నిటినీ సేకరించి కొత్త దాన్ని క్రియేట్ చేస్తుంది’ అని వివరించారు (Google Gemini privacy concerns).
ఇవి కూడా చదవండి:
చీరలకు పుట్టిల్లైన దేశంలో ఇదేం ట్రెండ్..శంతను నాయుడు సెటైర్లు
శాలరీ పెంచడం ఇష్టం లేక ఉద్యోగిని తొలగించిన కంపెనీకి భారీ షాక్