Reckless Driving Delhi: కాలుపైకాలేసి స్కూటీపై కూర్చుని డ్రైవింగ్.. పోతావ్ జాగ్రత్త అంటున్న జనాలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 07:54 PM
ఢిల్లీలో ఓ యువకుడు స్కూటీపై కాలుమీద కాలేసి కూర్చుని చేతిలోని ఫోన్ చూస్తూ డ్రైవ్ చేసిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూసిన జనాలు యువకుడిని తెగ తిట్టిపోస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వాహనాలు నడిపేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన జీవితాలతో పాటు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెట్టినట్టు అవుతుంది. నేటి సోషల్ మీడియాలో డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన కలిగించే వీడియోలు అందుబాటులో కూడా ఉన్నాయి. కానీ నిత్యం సామాజిక మాధ్యమాల్లో మునిగితేలే యువత కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. పెడ పోకడలకు తెర లేపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇతరుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ ఉదంతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసి జనాలు మండిపడుతున్నారు. ఫొటోలోని యువకుడిని తెగ తిట్టిపోస్తున్నారు (Reckless Driving on Scooty).
ఓ నెటిజన్ నెట్టింట ఈ ఫొటోను షేర్ చేశారు. కారులో వెళుతున్న సదరు నెటిజన్.. తన పక్కన స్కూటీపై ఓ యువకుడు చేసిన విన్యాసాన్ని ఫొటో తీసి నెట్టింట పంచుకున్నారు. ఈ ఫొటోలో కనిపించిన దాని ప్రకారం, హెల్మెట్ కూడా పెట్టుకోని ఆ యువకుడు స్కూటీపై కాలుమీద కాలేసి కూర్చుని మరీ డ్రైవ్ చేశాడు. ఇది చాలదన్నట్టు ఒక చేత్తో స్కూటీ హ్యాండిల్‌ను పట్టుకుని మరో చేత్తో ఫోన్ చూశాడు. ఎదురుగా వచ్చే వాహనాలతో తనకేమాత్రం సంబంధం లేదన్నట్టు అతడి వాలకం ఉంది (riding scooty phone in hand).
ఈ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో జనాలు మండిపడుతున్నారు. యువకుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు సెటైర్లు కూడా వేశారు. మనలాంటోళ్లు పోలీసులకు ఈజీగా దొరికిపోతారు కానీ ఇలాంటోళ్లకు మాత్రం ఏ ఇబ్బందీ ఉండదు అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ఈ అతి చేష్టలతో ఏదోక రోజు ప్రాణాల మీదకు రావడం పక్కా అని మరికొందరు అన్నారు. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇవి కూడా చదవండి:
చైనాలో కొత్త విధానం.. పబ్లిక్ బాత్రూమ్స్‌లో టాయిలెట్ పేపర్ కోసం యాడ్ చూడాల్సిందే
ఆ పుట్టుమచ్చ గురించి ఎలా తెలిసింది.. నానో బనానా ఫొటోతో మహిళకు షాక్