Asaduddin Owasi: హౌడీ మోడీ, నమస్తే ట్రంప్‌తో ఏం సాధించారు.. హెచ్ 1బి వీసా ఫీజు పెంపుపై ఒవైసీ
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:28 PM
ట్రంప్ ప్రభుత్వ హెచ్-1బి వీసా సిస్టమ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని, ముఖ్యంగా లబ్ధిదారులు గణనీయంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రభావం ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
న్యూఢిల్లీ: హెచ్-1బి వీసాలకు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owasi) శనివారంనాడు స్పందించారు. ట్రంప్ ప్రభుత్వ హెచ్-1బి వీసా సిస్టమ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోందని, ముఖ్యంగా లబ్ధిదారులు గణనీయంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రభావం ఉంటుందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. 'హౌడీ మోడీ', 'నమస్తే ట్రంప్' వంటి ఈవెంట్లు నిర్వహించడం ద్వారా ప్రధానమంత్రి ఏం సాధించారని ప్రశ్నించారు.
'ట్రంప్‌కు వ్యతిరేకంగా నేను ఫిర్యాదు చేయడం లేదు. ఆయన ఏం చేయాలనుకున్నారో అది చేశారు. నేను ప్రభుత్వాన్నే ప్రశ్నించదలచుకున్నాను. హౌడీ మోడీ, నమస్తే ట్రంప్‌తో మీరు సాధించినదేమిటి? మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద ఎన్ఐఆర్‌లందరినీ రప్పించి మీరు సాధించినదేమిటి?' అని ప్రశ్నించారు. భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా అమెరికా భావిస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు.
'మోదీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం విదేశాంగ విధానం విజయం కాదు. హెచ్1బి వీసాలకు ఇచ్చిన ముగింపు భారతీయులను లక్ష్యంగా చేసుకున్నదే. ఇండియాతో సంబంధాలను ప్రమాదంలోకి అమెరికా నెట్టేసిందనడానికి, మనకు వ్యూహాత్మకంగా ఏమాత్రం విలువనివ్వడం లేదనడానికి నిదర్శనం. మనం అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం. కానీ మనను వారు తమ భాగస్వాములుగా భావించడం లేదంటే అది మన ప్రభుత్వ వైఫల్యమే' అని ఒవైసీ విశ్లేషించారు.
యూఎస్ వీసాలలో 71 నుంచి 71 శాతం ఇండియన్లకు దక్కుతుండగా, ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉన్నాయని ఒవైసీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 37 శాతం ఇండియన్ ఎన్ఆర్ఐ డిపాజిట్లు ఉన్నాయి. కీలకమైన ఇంటర్‌జనరేషనల్ మొబిలిటీ క్లోజ్ అయితే ఇందుకు ఎవరిని నిదించాలి? అని ఒవైసీ ప్రశ్నించారు. విదేశాంగ విధానం, జాతీయ భద్రత విషయంలో ఇండియా ఎందుకు ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటోందనే విషయంపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
డీ-డాలరైజేషన్ విస్తరించాలి..
డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించే చర్యలను వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఒవైసీ కోరారు. 18 దేశాలతో డీ-డాలరైజేషన్ ఒప్పందాన్ని భారత్ చేసుకుందని, ఈ దేశాలతో ట్రేడ్ పేమెంట్ సెటిల్‌మెంట్స్ అన్నీ రూపాయిల్లోనే జరుగుతాయని చెప్పారు. ఈ వ్యాపారాన్ని ఇతర కీలక వాణిజ్య భాగస్వాములకు విస్తరించాలని, ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కు ఒక్క ఇంచ్ కూడా తగ్గకూడదని సూచించారు.
ఇవి కూడా చదవండి..
హెచ్-1బీ వీసాల రుసుము పెంపు భారత్‌కు లాభం, అమెరికాకు నష్టం!
విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..