Share News

PM Modi Reacts To Trumps: విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 02:00 PM

విదేశాలపై ఆధారపడటమే అన్నింటి కన్నా పెద్ద శత్రువని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటినుంచో చెబుతున్నట్లు పేర్కొన్నారు.

PM Modi Reacts To Trumps: విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ
PM Modi Reacts To Trumps

హెచ్ 1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము విధించటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు శనివారం ట్రంప్ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని మోదీ పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటినుంచో చెబుతున్నానన్నారు. మోదీ మాట్లాడుతూ.. ‘మనమంతా కలిసి ఆ శత్రువును జయించాల్సిన అవసరం ఉంది. విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలం అవుతుంది.


మనమంతా కలిసి భారత్‌ను ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలా మార్చాలి. ఇతరులతో కలిసి నడుద్దాం.. కానీ, ఆత్మాభిమానంతో బతుకుదాం. 140 కోట్ల మంది భవిష్యత్తును ఇతర దేశాల మీద వదిలేయబోం’ అని స్పష్టం చేశారు. కాగా, హెచ్ 1బీ వీసాలపై లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము ఉత్తర్వులపై డొనాల్డ్ ట్రంప్ నిన్న (శుక్రవారం) సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు రేపటి(సెప్టెంబర్ 21వ తేదీ) నుంచి అమల్లోకి రానున్నాయి.


భారత్‌కు లాభమే..

ట్రంప్ తీసుకున్న హెచ్ 1బీ వీసాలపై అధిక రుసుము నిర్ణయం అంతర్జాతీయ టాలెంట్‌కు తలుపు మూయటం లాంటిదని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. అది అమెరికాకు తీరని నష్టమని, భారత్‌కు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. బెంగళూరు, హైదరాబాద్, పుణె, గురుగ్రామ్‌ లాంటి ప్రాంతాల్లో కొత్త కొత్త స్టార్ట్‌అప్స్ మొదలవుతాయని చెప్పారు. ల్యాబ్స్ పుట్టుకొస్తాయని, అమెరికాలో జరిగాల్సిన అభివృద్ధి ఇండియాలో జరుగుతుందని అన్నారు. భారత దేశానికి చెందిన టాప్ డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు ఇండియా కోసం పని చేసే అవకాశం లభిస్తుందని ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Sep 20 , 2025 | 02:50 PM