September 2025 Bank Holidays: సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
ABN , Publish Date - Aug 23 , 2025 | 03:42 PM
సెప్టెంబర్ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పని ఉందా. అయితే ముందుగా ఈ సెలవుల గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెలలో దాదాపు 15 రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సెప్టెంబర్ నెల వచ్చేందుకు ఇంకా కొన్ని రోజులే ఉంది. అయితే సెప్టెంబర్ నెలలో బ్యాంకింగ్ కార్యకలాపాలకు కొన్ని రోజులు బ్రేక్ పడనుంది. ఎందుకంటే ఈ నెలలో కొన్ని ముఖ్యమైన తేదీల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అందులో దేశవ్యాప్తంగా జరుపుకునే ఈద్ మిలాద్ (సెప్టెంబర్ 5), ప్రతి నెలా వచ్చే రెండో శనివారం (సెప్టెంబర్ 13), నాలుగో శనివారం (సెప్టెంబర్ 27) కూడా బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. దీంతోపాటు మరికొన్ని పండుగ రోజుల్లో కూడా బ్యాంకులకు సెలవులు (September 2025 Bank Holidays) ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్
సెప్టెంబర్ 3 (బుధవారం): కర్మ పూజ సందర్భంగా రాంచీలో బ్యాంకులు బంద్
సెప్టెంబర్ 4 (గురువారం): ఓనం పండుగ నేపథ్యంలో కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు హాలిడే
సెప్టెంబర్ 5 (శుక్రవారం): ఈద్ మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) సందర్బంగా అగర్తలా, భువనేశ్వర్, చంఢీగఢ్, గ్యాంగ్ టక్, గౌహతి, జైపూర్, కోల్కత్తా, పనాజీ, పాట్నా, సిమ్లా, షిల్లాంగ్ ప్రాంతాలు కాకుండా, ఇతర ప్రాంతాల్లో హాలిడే
సెప్టెంబర్ 6 (శనివారం): ఈద్ మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) నేపథ్యంలో గ్యాంగ్ టక్, రాయ్ పూర్ ప్రాంతాల్లో సెలవు
సెప్టెంబర్ 7 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 12 (శుక్రవారం): ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తర్వాత శుక్రవారం జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో సెలవు
సెప్టెంబర్ 13 (శనివారం): రెండో శనివారం దేశవ్యాప్తంగా సాధారణ బ్యాంక్ సెలవు
సెప్టెంబర్ 14 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 21 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 22 (సోమవారం): నవరాత్రి నేపథ్యంలో జైపూర్లో సెలవు
సెప్టెంబర్ 23 (మంగళ వారం): మహారాజా హరి సింగ్ జీ పుట్టినరోజు సందర్భంగా జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో హాలిడే
సెప్టెంబర్ 27 (శనివారం): నాలుగో శనివారం – సాధారణ బ్యాంక్ సెలవు.
సెప్టెంబర్ 28 (ఆదివారం): వారాంతపు సెలవు
సెప్టెంబర్ 29 (సోమవారం): మహా సప్తమి/దుర్గా పూజ సందర్భంగా అగర్తలా, గౌహతి, కోల్కత్తా ప్రాంతాల్లో సెలవు
సెప్టెంబర్ 30 (మంగళ వారం): మహా అష్టమి/దుర్గా అష్టమి నేపథ్యంలో అగర్తలా, భువనేశ్వర్, గౌహతి, ఇంఫాల్, జైపూర్, కోల్కత్తా, పాట్నా, రాంచీ ప్రాంతాల్లో హాలిడే
గమనిక: ఈ సెలవుల నేపథ్యంలో మీ రాష్ట్రంలోని సెలవులు చెక్ చేసుకొని, బ్యాంకు పనులను ముందు ప్లాన్ చేసుకోవడం మంచిది.
సెలవులు ఉన్నా కూడా..
బ్యాంకులకు సెలవులు ఉన్నా, ఆన్‌లైన్ సేవలు యధావిధిగా కొనసాగుతాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యుపీఐ, ఏటీఎం సేవలు తదితర డిజిటల్ లావాదేవీలు పరిస్థితులపై ప్రభావం లేకుండా అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు తమ పనులను ఆన్‌లైన్‌లో సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఫండ్స్ ట్రాన్స్ఫర్, బ్యాలెన్స్ చెకింగ్, బిల్లుల చెల్లింపు వంటి సేవలు నిరంతరం పనిచేస్తాయి. బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులు ఎప్పుడైనా తమ అవసరాలను నెరవేర్చుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి