Gold Loan vs Personal Loan: అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:52 PM
గోల్డ్ లోన్ లేక పర్సనల్ లోన్.. వీటిలో ఏది బెస్ట్ అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో ఏది మంచిదనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా ఉద్యోగులు లేదా వ్యాపారులు డబ్బు అవసరం వచ్చినప్పుడు లోన్ తీసుకోవడం సహజం. కానీ గోల్డ్ లోన్ లేదా పర్సనల్ లోన్లలో దేనిని ఎంచుకోవాలి? రెండింటి మధ్య తేడాలు, లాభనష్టాలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ అంటే ఏంటి?
పర్సనల్ లోన్ అంటే, ఎలాంటి తాకట్టు లేకుండా తీసుకునే అన్‌సెక్యూర్డ్ లోన్. ఇందులో వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి (దాదాపు 10.85% నుంచి 24% వరకు). HDFC, ICICI, Axis వంటి బ్యాంకులు, NBFCలు ఈ లోన్‌లను అందిస్తాయి.
పర్సనల్ లోన్ ప్రయోజనాలు
మీరు బంగారం లేదా ఆస్తి వంటివి ఇవ్వాల్సిన పని లేదు
డబ్బును ఏ పనికోసమైనా (వివాహం, వైద్యం, ట్రావెల్) వినియోగించుకోవచ్చు
మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, సులభంగా లోన్ పొందవచ్చు
పర్సనల్ లోన్ రిస్క్
లోన్ చెల్లించలేకపోతే, మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఇది భవిష్యత్తులో మీరు లోన్ తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అలాగే మీకు ఇచ్చే లోన్ వడ్డీ రేట్లు ఎక్కువ కావడం వల్ల EMI భారం కూడా పెరుగుతుంది.
గోల్డ్ లోన్ అంటే ఏంటి?
గోల్డ్ లోన్ అంటే మీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకునే లోన్. ఇది సెక్యూర్డ్ లోన్, అంటే మీరు బంగారం ఇచ్చి డబ్బు తీసుకుంటారు. ఈ లోన్‌లో వడ్డీ రేట్లు సాధారణంగా తక్కువగా ఉంటాయి (దాదాపు 8% నుంచి మొదలు). పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం వంటి NBFCలు ఇలాంటి లోన్‌లను అందిస్తాయి.
గోల్డ్ లోన్ ప్రయోజనాలు
బంగారం తాకట్టు ఉండటం వల్ల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి
డాక్యుమెంటేషన్ తక్కువ, అందుకే లోన్ తొందరగా వస్తుంది
మీ బంగారం పరిమాణం, క్యారెట్ల ఆధారంగా లోన్ ఇస్తారు. క్రెడిట్ స్కోర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
గోల్డ్ లోన్ నష్టాలు
కానీ మీరు లోన్ తిరిగి చెల్లించలేకపోతే, మీ బంగారాన్ని బ్యాంక్ లేదా NBFC తీసుకోవచ్చు. కాబట్టి, చెల్లింపు సామర్థ్యం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.
ఏది బెస్ట్?
మీ దగ్గర తాకట్టు పెట్టడానికి బంగారం ఉండి, తక్కువ వడ్డీ రేటుతో లోన్ కావాలనుకుంటే గోల్డ్ లోన్ బెస్ట్. బంగారం లేదా ఆస్తి తాకట్టు పెట్టడం ఇష్టం లేనప్పుడు, మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే పర్సనల్ లోన్ తీసుకోవడం మంచిది. గోల్డ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీ, త్వరగా డబ్బు లభిస్తాయి. కానీ బంగారం రిస్క్‌లో ఉంటుంది. పర్సనల్ లోన్‌లో రిస్క్ తక్కువ, కానీ వడ్డీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే విషయం, చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.
గమనిక: పైన చెప్పిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆంధ్రజ్యోతి ఎలాంటి లోన్లను కూడా తీసుకోమని ప్రోత్సహించదు.
ఇవి కూడా చదవండి
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి