Share News

Jio Removed Rs 249 Plan: మొబైల్ యూజర్లకు షాక్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు!

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:12 PM

మొబైల్ వినియోగదారులకు మరోసారి షాకింగ్. గత ఏడాది జూలైలో జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచగా, ఇప్పుడు మళ్లీ జియో తన ప్లాన్‌లలో కీలక మార్పులు చేసింది. రేట్ల మార్పుతో పాటు పాత ప్లాన్లను తొలగించి, కొత్త ప్లాన్లను పరిచయం చేసింది.

Jio Removed Rs 249 Plan: మొబైల్ యూజర్లకు షాక్.. మళ్లీ పెరగనున్న రీఛార్జ్ ధరలు!
Jio Removed Rs 249 Plan

మొబైల్ యూజర్లకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత ఏడాది జూలైలో Jio, Airtel, Vi లాంటి ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ల ధరలను పెంచగా, ఇప్పుడు మళ్లీ ప్లాన్‌లలో మార్పులు చేశాయి. దాదాపు ఏడాది పాటు అన్ని ప్లాన్లను స్థిరంగానే ఉంచగా, ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే తాజాగా జియో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లక్షలాది మంది వాడుతున్న రోజువారీ 1GB డేటా ప్లాన్లను తొలగించేసింది.


డేటా ప్లాన్‌లు ఔట్

ఇకపై జియోలో 1GB డేటా పర్ డే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉండవు. గతంలో బాగా పాపులర్ అయిన ఈ ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీతో 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందించేది. ఈ ప్లాన్ ధర రూ. 249గా ఉండేది. కానీ, ఇప్పుడు ఈ ఆప్షన్ జియో పోర్ట్‌ఫోలియోలో లేదు. ఇప్పుడు జియో రోజువారీ డేటా ప్లాన్‌లు రూ. 299 నుంచి మొదలవుతున్నాయి. అంటే, గతంలో రూ. 249 ప్లాన్‌ను ఉపయోగించిన వాళ్లు ఇప్పుడు అదనంగా రూ. 50 ఖర్చు చేయాల్సి ఉంటుంది.


ప్రస్తుతం మాత్రం..

ప్రస్తుతం రూ.299 ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా పరంగా చూస్తే, ఇది ఖచ్చితంగా మంచి డీలే, కానీ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. జియో ఇప్పటికీ తమ వాల్యూ రీఛార్జ్ ప్లాన్‌ను రూ. 189కి అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాలింగ్, మొత్తం 2GB డేటా, 300 ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఇది తక్కువ డేటా వాడే వాళ్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.


1GB ప్లాన్‌లు తిరిగి వస్తాయా?

జియో మళ్లీ 1GB డేటా పర్ డే ప్లాన్‌లను మళ్లీ తీసుకొస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ, టెలికాం టాక్ రిపోర్ట్ ప్రకారం, జియో ఈ ఆప్షన్‌ను స్టోర్లు లేదా రిటైలర్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచవచ్చని తెలిపింది. అంటే ఆన్‌లైన్ రీఛార్జ్ ఆప్షన్‌లలో ఈ ప్లాన్ కనిపించకపోవచ్చు. కానీ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండొచ్చు.


ఎయిర్‌టెల్, వీఐలో ఇంకా 1GB ప్లాన్‌లు

జియో ఈ మార్పులు చేస్తున్నప్పటికీ, ఎయిర్‌టెల్, వీఐ మాత్రం 1GB డేటా పర్ డే ప్లాన్‌లను అందిస్తున్నాయి. కానీ, ఈ ప్లాన్‌ల ధర కూడా రూ.299గా ఉండటం విశేషం. అదే రూ.299 ధరకు జియో 1.5GB డేటా పర్ డే ప్లాన్ అందిస్తోంది. అంటే, డేటా పరంగా చూస్తే జియో ఆఫర్ కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు జియో పెంచిన తర్వాత మిగతా కంపెనీలు కూడా మళ్లీ వాటి ప్లాన్లను మార్పు చేసి ధరలను పెంచుతాయా అని కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.


ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 03:14 PM