Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:07 PM
Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
వచ్చే నెల 9వ తేదీ నుంచి దుబాయ్ (Dubai) వేదికగా ఆసియా కప్ (Asia Cup) జరగబోతోంది. ఈ ఆసియా కప్ పూర్తిగా టీ-20 ఫార్మాట్‌లోనే జరుగుతోంది. ఈ ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును తాజాగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. అనుకున్నట్టుగానే సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav)కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అయితే అంచనాలకు భిన్నంగా జట్టులో చోటు దొరకడమే కష్టమనుకున్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill)కు ఏకంగా వైస్-కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది.
15 మందితో కూడిన భారత జట్టును తాజాగా సెలక్షన్ కమిటీ ప్రకటించింది. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానంలో జితేష్ శర్మ వికెట్ కీపింగ్ బాధ్యతలను నిర్వహించనున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ స్పిన్ బాధ్యతలను పంచుకోబోతున్నారు.
ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, సంజు శాంసన్, హర్షిత్‌రాణా, రింకుసింగ్
ఇవి కూడా చదవండి
జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి