Share News

Neeraj Chopra: జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..

ABN , Publish Date - Aug 18 , 2025 | 08:15 AM

జావెలిన్ త్రోయింగ్‌లో నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు. 2025 డైమండ్ లీగ్ ఫైనల్లో అడుగుపెట్టి మరో ఘనత సాధించాడు. దీంతో మళ్లీ పతకం దక్కించుకునేందుకు నీరజ్ పోటీకి సిద్ధమయ్యారు.

Neeraj Chopra: జ్యూరిచ్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా..
Neeraj Chopra

జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి డైమండ్ లీగ్ 2025 ఫైనల్లో జ్యూరిచ్‌కు చేరుకున్నాడు. సిలేసియాను మిస్ చేసినప్పటికీ, నీరజ్ తన 15 పాయింట్లతో ఆరుగురు అథ్లెట్లలో ఒకడిగా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. ప్రస్తుతం నీరజ్ డైమండ్ లీగ్ స్టాండింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్నాడు. అతని ముందు కేషోర్న్ వాల్‌కాట్ (17 పాయింట్లు), జూలియన్ వెబర్ (15 పాయింట్లు) ఉన్నారు. నీరజ్ ఈ సీజన్‌లో రెండింటిలో పాల్గొన్నాడు.


ఓ స్పెషల్ ఈవెంట్

మే నెలలో దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ 90.23 మీటర్ల థ్రోతో అద్భుతంగా రాణించాడు. కానీ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత జూన్‌లో పారిస్ డైమండ్ లీగ్‌లో 88.16 మీటర్ల థ్రోతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ రెండు ఈవెంట్‌లలోనూ నీరజ్ తన సత్తా చాటాడు. జూలై 5న బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో నీరజ్ 86.18 మీటర్ల థ్రోతో మొదటి స్థానం సాధించాడు.


చల్లని వాతావరణంలో

కెన్యా మాజీ వరల్డ్ ఛాంపియన్ జూలియస్ యెగో 84.51 మీటర్లతో రెండో స్థానంలో, శ్రీలంక రుమేష్ పతిరాగే 84.34 మీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. ఈ ఈవెంట్‌లో జర్మనీ థామస్ రోహ్లర్, అమెరికా కర్టిస్ థాంప్సన్, బ్రెజిల్ లూయిజ్ మౌరీసియో డా సిల్వా, పోలాండ్ సైప్రియన్ మర్జిగ్లోడ్ వంటి వరల్డ్-క్లాస్ అథ్లెట్లు పాల్గొన్నారు. బెంగళూరులో చల్లని వాతావరణంలో అథ్లెట్లు తమ థ్రోల తర్వాత జాకెట్లు వేసుకుని కనిపించారు. ఇలాంటి సవాళ్ల మధ్య కూడా నీరజ్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇది తన డెడికేషన్‌ను, ఫోకస్‌ను చూపించిందని చెప్పవచ్చు.


ఫైనల్‌కు రెడీ

నీరజ్ 2022లో డైమండ్ లీగ్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జ్యూరిచ్‌లో జరిగే విన్నర్-టేక్స్-ఆల్ ఫైనల్‌లో అతను మళ్లీ సాధించాలని చూస్తున్నాడు. ఆగస్టు 22న బ్రసెల్స్ లెగ్‌లో నీరజ్ పాల్గొంటాడో లేదో ఇంకా క్లారిటీ లేదు. కానీ అతని ఫోకస్ జ్యూరిచ్ ఫైనల్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో అతను ఫైనల్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి

డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి

మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 18 , 2025 | 08:21 AM