PCB Salary Cuts: పాక్ క్రికెటర్ల జీతాల్లో కోత
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:20 AM
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కొంతకాలగా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ...
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కొంతకాలగా వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. తమ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న బాబర్ ఆజమ్, రిజ్వాన్ తదితర ఆటగాళ్ల జీతాల్లో కోత విధించబోతున్నారు. అలాగే ఐసీసీ నుంచి బోర్డుకు దక్కే ఆదాయం నుంచి ప్రస్తుతం ఆటగాళ్లకు 3 శాతం మొత్తాన్ని ఇస్తున్నారు. ఇకముందు ఈ వెసులుబాటును తొలగించనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి