Uttam Kumar comments: కేసీఆర్, హరీష్‌రావు చెప్పేవన్నీ అసత్యాలే: మంత్రి ఉత్తమ్‌కుమార్
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:24 PM
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.27 వేలకోట్లే ఖర్చు చేసిందని, గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తవడం నిజం కాదని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్‌రావు అసత్యాలు చెబుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.27 వేలకోట్లే ఖర్చు చేసిందని, గత ప్రభుత్వంలో 90 శాతం పనులు పూర్తవడం నిజం కాదని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్‌రావు అసత్యాలు చెబుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. రూ.27 వేలకోట్లే ఖర్చు చేసి 90 శాతం పూర్తిచేశారని ఎలా చెబుతారని బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు (KCR Harish Rao lies allegation).
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.80 వేలకోట్లు కావాలని, ఇప్పటికి తమ ప్రభుత్వం రూ.7 వేలకోట్లు ఖర్చు పెట్టిందని ఉత్తమ్ తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్టు పనులు తామే పూర్తి చేసినట్టు బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలు చెబుతున్నారని, ప్రాజెక్టుకు తట్టెడు మట్టి వేయలేదంటూ తమపై దుష్ప్రచారం చేయడం సరికాదని చెప్పారు (minister uttam statement).
2015లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.35 వేలకోట్లు అని, జీఓ ఇచ్చిన ఏడేళ్ల తర్వాత పాలమూరుపై డీపీఆర్ పంపారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు (Telangana politics). అప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.55 వేలకోట్లుగా చూపారని, డీపీఆర్‌లో ఆయకట్టు కాల్వల ఖర్చు వివరాలు లేవని ఉత్తమ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 516ల మధ్యలో 519 ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెట్టండి..
సౌదీ అరేబియాలో మంచు వర్షం.. ఆ అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా..