Saudi Arabia snowfall: సౌదీ అరేబియాలో మంచు వర్షం.. ఆ అందాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా..
ABN , Publish Date - Jan 01 , 2026 | 03:31 PM
సౌదీ అరేబియాలోని ఎడారి ఇసుక మంచుతో తడిసి తెల్లగా మారిపోయింది. ప్రకృతి గీసిన అందమైన పెయింటింగ్‌లా ఉంది. యూరప్, మధ్య ఆసియా నుంచి బలమైన చల్లని గాలుల కారణంగానే సౌదీ అరేబియాలో మంచు వర్షం కురుస్తోంది. దీంతో చాలా మంది హిమపాతాన్ని వీక్షించేందుకు సౌదీ వెళ్లానుకుంటున్నారు.
సాధారణంగా శీతాకాలంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు, మంచు అందాలను వీక్షించేందుకు సౌదీ అరేబియా వెళ్లాలని ఎవ్వరూ అనుకోరు. ఎందుకంటే ఆ ఎడారి దేశం సూర్యుడు, ఇసుక, వేడిగాలులు, ఎండకు మాత్రమే ప్రసిద్ధి. అయితే ఈ ఏడాది మాత్రం సౌదీ అరేబియాను ప్రకృతి కరుణించింది. సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలను మంచు కప్పేసింది. యూరప్ దేశాలను తలపించేలా మార్చేసింది. దీంతో చాలా మంది హిమపాతాన్ని వీక్షించేందుకు సౌదీ వెళ్లానుకుంటున్నారు (snow in Saudi Arabia).
సౌదీ అరేబియాలోని ఎడారి ఇసుక మంచుతో తడిసి తెల్లగా మారిపోయింది. ప్రకృతి గీసిన అందమైన పెయింటింగ్‌లా ఉంది. యూరప్, మధ్య ఆసియా నుంచి బలమైన చల్లని గాలుల కారణంగానే సౌదీ అరేబియాలో మంచు వర్షం కురుస్తోంది. తేమతో నిండిన మేఘాలు ఘనీభవించి హిమపాతానికి కారణమయ్యాయి. దీంతో సౌదీలో రాత్రి వేళల ఉష్ణోగ్రతలు రికార్డు కనిష్టాలకు పడిపోయాయి. ముఖ్యంగా సౌదీలోని పర్వత ప్రాంతాలలో ఈ హిమపాతం ఎక్కువగా ఉంది (Saudi winter travel).
సౌదీ అరేబియాలో తబుక్, జబల్ అల్-లాజ్, అల్ జాఫ్ చుట్టుపక్కల ఎడారి ప్రాంతాలు తెల్లటి మంచు దుప్పటిని కప్పుకుని ఉన్నాయి (Saudi Arabia snow locations). ఫిబ్రవరి వరకు ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణ నిపుణలు అంచనా వేస్తున్నారు. సౌదీలోని రియాద్ లేదా జెడ్డాకు వెళ్లి అక్కడి నుంచి తబుక్ చేరుకోవచ్చు. కారు అద్దెకు తీసుకుని సమీప పర్వత ప్రాంతాలకు వెళ్లొచ్చు. అయితే అక్కడ పగటి పూట ప్రయాణమే ఉత్తమం. ఎందుకంటే ఎడారిలో చలి చాలా తీవ్రంగా ఉంటుంది. సౌదీ అరేబియాలో మారుమూల ప్రాంతాలను సందర్శించేటపుడు స్థానిక ఆచారాలను తప్పక గౌరవించాలి.
ఇవి కూడా చదవండి
పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే డయాబెటిస్ రిస్క్ ..!
ప్రళయ్ మిసైళ్ల ప్రయోగం విజయవంతం