Uttam Kumar Reddy: తుపాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. మంత్రి ఉత్తమ్ కీలక సమీక్ష..
ABN , Publish Date - Oct 27 , 2025 | 09:15 PM
మొంథా తుఫాన్ ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై తుపాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం గురించి చర్చ జరిగింది.
హైదరాబాద్: మొంథా తుపాన్ (Cyclone Montha) ప్రభావంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంపై తుపాన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయం గురించి చర్చ జరిగింది. అలాగే తుపాన్ ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశించారు.
టార్పాలిన్లను వినియోగించి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. వీటిల్లో ఇప్పటికే 4,428 కేంద్రాలు ప్రారంభం అయ్యాయని.. మిగిలినవి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 22,433మంది రైతుల నుంచి 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకూ కొనుగోలు చేసిన ధాన్యం విలువ దాదాపు రూ.431.09 కోట్లు (Telangana news) ఉంటుందని తెలిపారు.
ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు (flood preparedness). ఈ ప్రక్రియలో ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు నష్టం జరిగితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
కట్టింగ్ మాస్టర్‌గా మారిన సీఎం రేవంత్ రెడ్డి