Share News

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ABN , Publish Date - Oct 27 , 2025 | 08:21 PM

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారిక గృహాల మరమ్మతుల ఖర్చుల పరిమితులు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల గృహాల రిపేర్ ఖర్చులకు కొత్త సీలింగ్ లిమిట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
Telangana Government

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అధికారిక గృహాల మరమ్మతుల ఖర్చుల పరిమితులు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారుల గృహాల రిపేర్ ఖర్చులకు కొత్త సీలింగ్ లిమిట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల అధికారిక నివాసాల మరమ్మతుల కోసం రూ.20 లక్షల వరకు ఖర్చుకు అనుమతినిచ్చింది. IAS, IPS అధికారుల గృహాలకు రూ.12 లక్షల వరకు సీలింగ్ పరిమితిని పెంచింది. ఇతర ప్రభుత్వ అధికారుల అధికారిక నివాసాల మరమ్మతులకు రూ.7 లక్షల వరకు ఖర్చు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది.


పదిహేనేళ్ల క్రితం నిర్ణయించిన రేట్లను తాజాగా ఇవాళ (సోమవారం) సడలించింది. పెరిగిన కూలీ, మెటీరియల్ ఖర్చుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పెంపు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్&బీ చీఫ్ ఇంజనీర్ సిఫార్సులపై ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త లిమిట్ల అమలు వెంటనే చేయాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి:

Minister Tummala: ఆ పంటల కొనుగోలుకు కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలి: మంత్రి తుమ్మల

Minister Uttam:తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల పునరుద్ధరణ: మంత్రి ఉత్తమ్

Updated Date - Oct 29 , 2025 | 10:29 AM