Home » Politics
ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేశ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు చాలా జరిగాయి. పొత్తులు, ఎన్నికలు, పార్లమెంటరీ డిబేట్లు, పాలసీ విధానాలు పాలిటిక్స్‌ను రోలర్ కోస్టర్ రైడ్‌లోకి తీసుకెళ్లాయి.
చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటూ కాంగ్రెస్ సర్కార్‌కి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో..
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ' రేవంత్.. ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను. రేవంత్ ఇంట్లోని మహిళలను, పిల్లలను, మనుమడి గురించి నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. నదీ జలాల విషయంలో మాట్లాడేందుకు కేసీఆర్ మీడియా ముందుకు రానున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నదీ జలాలు, ప్రాజెక్టులపై..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ భరితంగా మారింది. మరికాసేపట్లో ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనుంది. సరిగ్గా 3.30 గంటలకు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై..
అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డిల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తుది తీర్పు ప్రకటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ మాస్టర్ ప్లాన్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే మిషన్ 2028 ను బీజేపీ ప్రారంభించింది.
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ శ్రేణులు సీరియస్ గా ఉన్నారు. కేసీఆర్ కుమార్తెగా గౌరవించి ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నామని, ఇక మాటకు మాట సమాధానం చెబుతామని అంటున్నారు. పార్టీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే అందుకు కారణమని తెలుస్తోంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టు తల మీద ఉన్నా నల్గొండ జిల్లాలోని కొన్ని మండలాలకు ఇప్పటికీ నీరు అందడంలేదని కవిత ఫైర్ అయ్యారు. జిల్లాలోని నక్కలగండి ప్రాజెక్టు సందర్శించి నిర్వాసితులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల్లికల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ ను పూర్తి చేయకపోవడం దారుణమని అన్నారు.
పీపీపీ మోడల్ నిర్ణయం ద్వారా కేవలం రెండేళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని సీడాప్ ఛైర్మన్ జి. దీపక్ రెడ్డి అన్నారు. వైసీపీ విధానంలో అయితే ఇదే పనికి 15-20 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు.