Share News

KTR comments: రేవంత్ రెడ్డి సర్కార్‌కి హనీమూన్ ముగిసింది: కేటీఆర్

ABN , Publish Date - Dec 20 , 2025 | 06:40 PM

రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ' రేవంత్.. ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను. రేవంత్ ఇంట్లోని మహిళలను, పిల్లలను, మనుమడి గురించి నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను' అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

KTR comments: రేవంత్ రెడ్డి సర్కార్‌కి హనీమూన్ ముగిసింది: కేటీఆర్
KTR Comments

హైదరాబాద్, డిసెంబర్ 20: రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సర్కార్‌కి హనీమూన్ ముగిసిందంటూ ఆయన ఎద్దేవా చేశారు. శనివార తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సంద్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..' రేవంత్.. ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను. రేవంత్ ఇంట్లోని మహిళలను, పిల్లలను, మనుమడి గురించి నేను మాట్లాడను.


రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబ సభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసింది. ‌ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారుకేసీఆర్ రేపు(ఆదివారం) అన్ని విషయాలపై దిశానిర్దేశం చేస్తారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ కార్యక్రమం ఉంటుంది. కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం ఉంటుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు...కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి.. బీఆర్ఎస్ లోనే ఉన్నామనటం‌ పెద్ద కామెడీగా ఉంది. పంచాయతీ ఎన్నికల విషయంలో రేవంత్ చెప్తోన్న 66శాతం నిజమైతే.. పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్ కు రావాలి.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ గా నేను ఫెయిల్ కాదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక32జిల్లా పరిషత్, 136మున్సిపాలిటీలు గెలిచాము. రేవంత్ సీఎం అయ్యాక.. సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదు. నేకు ఐరన్ లెగ్ కాదు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలే ఐరన్ లెగ్‌లు. పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించరు. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. అలానే గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదు. జీహెచ్‌ఎంసీని మూడు కార్పోరేషన్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనగా ఉంది. అయితే గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై కూడా సీఎంకు స్పష్టత లేదు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.ఫార్ములా ఈ రేస్‌, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏమీ లేదని రేవంత్ కు అర్థమైంది. రేవంత్ పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం.


కాంగ్రెస్ పాలన దెబ్బకు పరిశ్రమలు ఆంధ్రకు వెళ్ళిపోతున్నాయి. విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు వెళ్లింది. కాంగ్రెస్ పాలనపై ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టైమ్ కోసం ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. ఇక 42శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వమని చెప్పటానికి రేవంత్ ఎవరు?. మేము పార్లమెంట్ ఎన్నికల్లో 50శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30శాతం సీట్లు బీసీలకు ఇచ్చాము. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. మార్కెట్ యార్డ్ లు బీసీలకు ఇచ్చాము. అలానే విద్యా, ఉపాధిలో బీసీలకు‌ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు?.


అఖిలేష్ యాదవ్ తో ఫ్రెండ్లీగా ఉంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకు?. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి‌ మాత్రమే లోపాయికారి ఒప్పందం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కు ఏటీంగా మారిందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వయంగా అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఎంపీ దుబే గృహప్రవేశానికి తెలంగాణ సీఎం ఎందుకు వెళ్లారో రామచంద్రరావు చెప్పాలి. ఢిల్లీలో రేవంత్ రెడ్డి విందులు, వినోదాలు ఎవరి ఇళ్ళల్లో జరుగుతున్నాయో మాకు తెలుసు. దేశ రాజధాని ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో రేవంత్ రెడ్డి ఇల్లు రీమోడల్ చేయించిందే బీజేపీ ఎంపీనే. తెలంగాణ సీఎం రేవంత్ .. ఒక కాలు కాంగ్రెస్ లో.. మరొక కాలు బీజేపీలో ఉంచారు. కిషన్ రెడ్డితో మాకు అండర్ స్టాండింగ్ ఉందని అంటున్నారు. కిషన్ రెడ్డి మాకు చేసింది ఏంటో చెప్పాలి' అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - Dec 20 , 2025 | 07:15 PM