YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. 50 మంది రాజీనామా..!
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:03 PM
జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకేసారి మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తూర్పుగోదావరి, డిసెంబర్ 20: జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకేసారి మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. గోపాలపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు నడుస్తున్నాయి. అయితే పార్టీ అధిష్టానం, నియోజవర్గ ఇన్‌చార్జ్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. దీంతో ఆ ఇష్యూ కాస్తా చిలికిచిలికి గాలి వానగా మారింది. పార్టీ నాయకులు.. మండల స్థాయి నేతలను, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులను పట్టించుకోవడంలేదని అలక వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
రాజీనామా చేసిన వారిలో మాజీ శాఫ్ డైరెక్టర్ కప్పల వరలక్ష్మి, గోపాలపురం వైస్ ఎంపీపీ వెంకటేశ్వరమ్మ, ఎంపీటీసీ సభ్యులు వారా సంగీత, పంచాయతీ ఉప సర్పంచ్, గ్రామ కమిటీ అధ్యక్షులు వింత అమర ప్రసాద్ రెడ్డి, గోపాలపురం గ్రామ సచివాలయ కన్వీనర్ ముద్దన మురళి, 50 మంది నాయకులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరంతా రానున్న రెండు రోజుల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరంతా గోపాలపురం ఎమ్మెల్యేతో మాట్లాడి ఆయన సమక్షంలో పార్టీలో చేరేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. కాగా పంచాయతీ ఎన్నికలు 2026 మార్చి తర్వాత జరగనున్న నేపథ్యంలో గోపాలపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ షాక్ అని చెప్పవచ్చు.
Also Read:
Mirror Vastu Tips: ఇంట్లో ఈ 3 చోట్ల అద్దం అస్సలు పెట్టకండి..
CP Sajjanar: అనుమానాస్పద కాల్స్ వస్తే 1930కి కాల్ చేయండి : సీపీ సజ్జనార్