Mirror Vastu Tips: ఇంట్లో ఈ 3 చోట్ల అద్దం అస్సలు పెట్టకండి..
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:55 PM
అద్దాలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, ఇంట్లో ఉన్న శక్తిపై కూడా ప్రభావం చూపుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, అద్దాన్ని తప్పు దిశలో ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ప్రతి ఇంట్లో అద్దం ఉంటుంది. అద్దం మన రూపాన్ని చూపించడమే కాకుండా, ఇంటి వాస్తుపై కూడా ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలియదు. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ అద్దం పెట్టేస్తారు. కానీ వాస్తు ప్రకారం, అలా చేయడం వల్ల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అద్దం పెట్టడానికి మంచి దిశలు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో అద్దం పెట్టడానికి ఉత్తర దిశ చాలా మంచిది. ఈ దిశలో అద్దం ఉంచితే డబ్బు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో శాంతి ఉంటుంది. అలాగే తూర్పు దిశ లేదా ఈశాన్య మూలలో కూడా అద్దం పెట్టవచ్చు. ఈ దిశల్లో అద్దం ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్మకం.
అద్దం పెట్టకూడని దిశలు
వాస్తు ప్రకారం, ఇంట్లో దక్షిణ లేదా పడమర దిశల్లో అద్దం పెట్టకూడదు. ఇలా చేస్తే ప్రతికూల శక్తి పెరిగి, ఇంట్లో ఆనందం తగ్గుతుందని చెబుతారు. ఈ దిశల్లో అద్దం ఉంటే డబ్బు నిలవదని వాస్తు నిపుణులు అంటారు. అలాగే ఆగ్నేయ మూల, బెడ్‌రూమ్, వంటగది, పూజ గది (ఆలయం) లేదా స్టోర్ రూమ్లో అద్దం పెట్టడం మంచిది కాదు. ఈ ప్రదేశాల్లో అద్దం ఉంటే ఇంట్లో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని ఆనందం తగ్గుతుందని నమ్మకం.
(Note: ఇందులోని సమాచారం వాస్తు నిపుణుల ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
న్యూ ఇయర్ పార్టీ.. ఇండియాలో బెస్ట్ బీచ్ డెస్టినేషన్స్ ఏవో తెలుసా?
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!
For More Latest News